News October 29, 2024

స్విగ్గీ IPO.. రూ.371-390 మధ్య ధరల శ్రేణి

image

ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ IPO నవంబర్ 6 నుంచి 8 వరకు కొనసాగనుంది. ధరల శ్రేణిని రూ.371-390 మధ్య నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆఫర్ సేల్ ద్వారా రూ.6,800 కోట్లు, కొత్త షేర్ల జారీతో రూ.4,500 కోట్లు(మొత్తం రూ.11,300 కోట్లు) సమీకరించనుంది. ఈ ఏడాది వస్తున్న అతిపెద్ద IPOల్లో స్విగ్గీ ఒకటి. 2022 లెక్కల ప్రకారం స్విగ్గీ విలువ 10.7 బిలియన్ డాలర్లు.

Similar News

News February 19, 2026

నెలసరికి ముందు ఇవి మేలు..

image

నెలసరికి ముందు ఆడవారి శరీరంలో అనేక మార్పులు వస్తాయి. వీటి వల్ల ఒళ్లు బరువుగా ఉండటం, కడుపు నొప్పి, రొమ్ముల సలపరం వేధిస్తాయి. దీన్నే ప్రీ మెన్‌స్ట్రువల్ సిండ్రోమ్ అంటారు. ఈ లక్షణాలు తగ్గించడానికి డైట్‌లో డ్రైఫ్రూట్స్‌, మిల్లెట్స్‌, పెసలు, అలసందలు చేర్చుకోవాలి. శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉన్న ఆహారాలు, కూల్ డ్రింక్స్, కాఫీలు ఎక్కువగా తీసుకుంటే నెలసరి సమస్యలు మరింత పెరుగుతాయంటున్నారు నిపుణులు.

News February 19, 2026

వాట్సాప్‌లో ఇంటర్ హాల్ టికెట్స్

image

TG: ఇంటర్ హాల్ టికెట్ల డౌన్‌లోడ్ లింక్‌లను విద్యార్థుల తల్లిదండ్రుల వాట్సాప్‌కు పంపినట్లు బోర్డు వెల్లడించారు. tgbie.cgg.gov.in సైట్ సర్వర్లు బిజీగా ఉంటే ప్రత్యామ్నాయంగా WhatsApp లింక్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. సాంకేతిక సమస్యలుంటే కాలేజీ ప్రిన్సిపల్‌ను సంప్రదించాలని సూచించారు. హాల్‌టికెట్‌పై ఉన్న QR Code స్కాన్ చేస్తే ఎగ్జామ్ సెంటర్ లొకేషన్ చూపిస్తుంది. పరీక్షలు ఈనెల 25 నుంచి జరగనున్నాయి.

News February 19, 2026

5,349 పోస్టులకు నోటిఫికేషన్

image

<>RRC<<>> వెస్ట్రన్ రైల్వే పరిధిలో 5,349 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. టెన్త్, ఐటీఐ అర్హత గలవారు ఫిబ్రవరి 21 నుంచి మార్చి 23 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 24 ఏళ్ల లోపు ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. మెరిట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.100, SC,ST, PwBD, మహిళలకు ఫీజు లేదు. వెబ్‌సైట్: https://www.rrc-wr.com/