News October 29, 2024

ATC కోర్సుల అడ్మిషన్లకు రేపే చివరి గడువు

image

ఖమ్మం జిల్లాలోని ఐటిఐలలో ఏర్పాటు చేస్తున్న అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లలో కోర్సుల ప్రవేశాల కొరకు బుధవారం చివరి గడువు అని అదనపు కలెక్టర్ శ్రీజ ఓ ప్రకటనలో తెలిపారు. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లలో కోర్సులలో చేరడానికి అడ్మిషన్ కోసం ttps://iti.telangana.gov.in ఆన్ లైన్ పోర్టల్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Similar News

News January 22, 2026

ఖమ్మం జిల్లా ఆసుపత్రిలో ‘నిఘా’ వైఫల్యం

image

ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో భద్రత గాలిలో దీపమైంది. ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో మెడికల్ కౌన్సిల్ నిబంధనల కోసం పెట్టిన 12 మినహా, మిగిలినవన్నీ మరమ్మతులకు గురై మూలనపడ్డాయి. నిర్వహణ లోపంతో కీలక నేరాలు జరిగినప్పుడు ఫుటేజీ లభించక పోలీసులు ఇబ్బందులు పడుతున్నారు. కోట్లు వెచ్చిస్తున్నా పర్యవేక్షణ కరువైందని రోగులు వాపోతున్నారు. అధికారులు స్పందించి ఆసుపత్రిలో భద్రతను కట్టుదిట్టం చేయాలని కోరుతున్నారు.

News January 22, 2026

ఖమ్మం: మున్సిపల్ పోరు.. సర్వేల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక..!

image

ఖమ్మం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల వేడి పెరిగింది. పార్టీలన్నీ గెలుపు గుర్రాల వేటలో పడ్డాయి. ఆశావహులు భారీగా ఉండటంతో అభ్యర్థుల ఎంపిక పార్టీలకు సవాలుగా మారింది. కాంగ్రెస్‌లో పోటీ తీవ్రంగా ఉండటంతో సర్వేల ఆధారంగా ఎంపిక ప్రక్రియను ప్రారంభించారు. అటు బీఆర్ఎస్ సైతం సర్వేలతో పాటు వార్డుల్లో పట్టున్న నేతల కోసం కసరత్తు చేస్తున్నాయి. అభ్యర్థుల బలాబలాలను బేరీజు వేస్తూ గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి.

News January 22, 2026

మహిళా సమాఖ్యలకు ఆర్టీసీ ‘అద్దె’ తోడ్పాటు

image

మహిళా సాధికారతే లక్ష్యంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన అద్దె బస్సుల పథకం ఉమ్మడి జిల్లాలో సత్ఫలితాలనిస్తోంది. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లోని 21 మండల సమాఖ్యలు నిర్వహిస్తున్న బస్సులకు ఆర్టీసీ రూ.87.52 లక్షల అద్దె చెల్లించింది. ఒక్కో బస్సుకు నెలకు సగటున రూ.69,468 ఆదాయం లభిస్తోంది. ప్రభుత్వం మంజూరు చేసిన రూ.30 లక్షల నిధులతో ప్రారంభమైన ఈ ప్రక్రియ మహిళలను విజయవంతమైన వ్యాపారవేత్తలుగా మారుస్తోంది.