News October 29, 2024
అడిగినన్ని టికెట్లు ఇవ్వలేదనే ఆరోపణలు: TTD

AP: TTD అదనపు ఈవో వెంకయ్య చౌదరిపై శ్రీకాకుళం జిల్లా ఆనందాశ్రమ పీఠాధిపతులు చేసిన ఆరోపణలపై టీటీడీ స్పందించింది. ‘స్వామీజీ 50 మందికి బ్రేక్ దర్శనం, 550 మందికి ప్రత్యేక ప్రవేశ దర్శనంతో పాటు తిరుమలలో వసతి కల్పించాలని కోరారు. ఆదివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ సంఖ్యను తగ్గించాలని అదనపు ఈవో కోరారు. స్వామీజీ కోపంతో మీడియా సమక్షంలో అదనపు ఈవోను కించపరుస్తూ మాట్లాడారు’ అని పేర్కొంది.
Similar News
News January 20, 2026
ఏకైక ప్లేయర్గా జకోవిచ్ రికార్డు

ఆస్ట్రేలియన్ ఓపెన్(టెన్నిస్)లో తొలి రౌండ్లో గెలుపుతో 100 విజయాలు పూర్తి చేసుకున్న జకోవిచ్ అరుదైన ఘనత సాధించారు. ఆస్ట్రేలియన్ ఓపెన్(సింథటిక్)తో పాటు వింబుల్డన్(గ్రాస్), ఫ్రెంచ్ ఓపెన్(మట్టి).. మూడు గ్రాండ్ స్లామ్ ఈవెంట్లలో 100 చొప్పున మ్యాచులు గెలిచిన ఏకైక ప్లేయర్గా నిలిచారు. ఈ టోర్నీలో టైటిల్ గెలిస్తే 25 మేజర్ ట్రోఫీలు నెగ్గిన తొలి ఆటగాడిగా రికార్డులకెక్కనున్నారు.
News January 20, 2026
అతి శక్తమంతమైన ‘హనుమాన్ గాయత్రీ మంత్రం’

‘‘ఓం ఆంజనేయాయ విద్మహే.. వాయుపుత్రాయ ధీమహి.. తన్నో హనుమత్ ప్రచోదయాత్’’
ఈ ఆంజనేయ గాయత్రీ మంత్రం అత్యంత శక్తిమంతమైనది. దీన్ని ధైర్యం, భక్తిని పెంపొందించుకోవడానికి రోజూ భక్తితో 11 సార్లు జపించాలని పండితులు సూచిస్తున్నారు. క్రమం తప్పకుండా దీన్ని పారాయణ చేస్తే ఆంజనేయుడి అనుగ్రహంతో అన్ని రకాల ప్రమాదాల నుంచి రక్షణ లభిస్తుందని చెబుతున్నారు. భయం పోయి మనోధైర్యం కలగడానికి ఇదో అద్భుతమైన మార్గం.
News January 20, 2026
రాష్ట్రంలో పశువులకు బీమా పథకం ప్రారంభం

AP: పశువుల అకాల మరణంతో రైతులకు కలిగే ఆర్థిక నష్టాన్ని నివారించేందుకు ప్రభుత్వం పశు బీమా పథకాన్ని తీసుకొచ్చింది. ప్రీమియం మొత్తంలో ప్రభుత్వం 85% భరించనుండగా రైతు 15% చెల్లించాలి. మేలు జాతి పశువులకు ₹30,000, నాటు పశువులకు ₹15,000 వరకు కవరేజీ ఉంటుంది. ఈ నెల 31 వరకు గ్రామాల్లో నిర్వహిస్తున్న ఉచిత పశు ఆరోగ్య శిబిరాల్లో రైతులు నమోదు చేసుకోవచ్చని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.


