News October 29, 2024
వరద సాయానికి మరో అవకాశం!

AP: విజయవాడ వరద బాధితులకు ప్రభుత్వం పారదర్శకంగా పరిహారం అందించినట్లు అధికారి ఆర్పీ సిసోడియా తెలిపారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఏ ఒక్క బాధితుడికీ అన్యాయం జరగకుండా చూడాలన్నదే ప్రభుత్వ సంకల్పమని చెప్పారు. 1,46,318 మంది ఖాతాల్లో రూ.238.38 కోట్లు జమ చేసినట్లు తెలిపారు. ఇప్పటికీ పరిహారం అందకుంటే దరఖాస్తు చేసుకునే అవకాశముందని పేర్కొన్నారు. వరద సాయంపై దుష్ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు.
Similar News
News November 13, 2025
IPL: ఆ జట్టులోకి సచిన్ కొడుకు!

IPL: సచిన్ కుమారుడు అర్జున్ టెండూల్కర్‌ను లక్నో సూపర్ జెయింట్స్ సొంతం చేసుకున్నట్లు ESPNCricinfo తెలిపింది. ముంబై నుంచి రూ.30 లక్షల ధరకు లక్నోకు వెళ్లారని, త్వరలో అధికారిక ప్రకటన రానుందని పేర్కొంది. ఇతడిని 2021 వేలంలో రూ.20 లక్షలకు ముంబై కొనుగోలు చేసింది. 2025 వరకు కేవలం 5 మ్యాచులు మాత్రమే ఆడే అవకాశం దక్కింది. IPL కెరీర్‌లో ఈ ఆల్‌రౌండర్ 3 వికెట్లు తీయడంతో పాటు 114 రన్స్ చేశారు.
News November 13, 2025
మహావిష్ణువు పేరును ఎందుకు స్తుతించాలి?

జగత్ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమం|
స్తువన్నా మసహస్రేణ పురుషస్సతతోత్థితః||
భారతంలో భీష్ముడు, ధర్మరాజుకు ఈ శ్లోకాన్ని చెప్పారు. ‘జగత్ప్రభువు, దేవదేవుడు, అనంతుడు, పురుషోత్తముడు అయిన విష్ణువును వేయి నామాలతో స్తుతించిన పురుషుడికి నిత్యం శుభాలు కలుగుతాయి’ అనేది దీనర్థం. నిరంతరం విష్ణు నామాన్ని స్మరిస్తూ, ఆయన సేవ చేసే వ్యక్తికి ఎప్పుడూ మంచే జరుగుతుందని ఈ శ్లోకం వివరిస్తుంది. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>
News November 13, 2025
ఇండియా A విజయం

సౌతాఫ్రికా Aతో జరిగిన తొలి అనధికార వన్డేలో ఇండియా A విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 9 వికెట్లు కోల్పోయి 285 రన్స్ చేసింది. అనంతరం భారత్ 49.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (117) సెంచరీతో అదరగొట్టారు. తిలక్ వర్మ 39, నితీశ్ 37, అభిషేక్ శర్మ 31 రన్స్ చేశారు.


