News October 29, 2024

400 ఎకరాల తాకట్టుకు ప్రభుత్వం సిద్ధం

image

TG: HYDలో ఖరీదైన ప్రాంతాలుగా పేరున్న కోకాపేట, రాయదుర్గంలో ₹20వేల కోట్ల విలువైన 400 ఎకరాలను ప్రైవేటు కంపెనీలకు తాకట్టు పెట్టేందుకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. మూలధనం, ఇతర అవసరాల కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ₹10వేల కోట్ల రుణం కోసం పరిశ్రమల మౌలిక సదుపాయాల సంస్థకు గ్యారంటీ ఇచ్చింది. ఇటీవల సీఎం రేవంత్ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ భేటీలో దీనికి ఆమోదం లభించింది.

Similar News

News January 3, 2025

నేటి నుంచి నుమాయిష్

image

TG: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో నేటి నుంచి నుమాయిష్ ప్రారంభం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సాయంత్రం 4 గంటలకు దీనిని ప్రారంభించనున్నారు. ఈ ఏడాది నుమాయిష్‌లో 2వేల స్టాల్స్‌ను సొసైటీ ఏర్పాటు చేయనుంది. ప్రతి రోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సందర్శకులను అనుమతిస్తారు. వీకెండ్స్‌లో మరో గంట అదనపు సమయం కేటాయించారు. ప్రవేశ రుసుము రూ.50.

News January 3, 2025

మహా కుంభమేళాకు మరిన్ని ప్రత్యేక రైళ్లు

image

ఉత్తర్ ప్రదేశ్‌లో జనవరి 14 నుంచి ప్రారంభమయ్యే మహా కుంభమేళాకు 26 అదనపు రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. వచ్చే నెల 5 నుంచి 27 వరకు ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర నుంచి యూపీ మధ్య నడవనున్నాయి. గుంటూరు, మచిలీపట్నం, కాకినాడ నుంచి వెళ్లే రైళ్లు వరంగల్, రామగుండం మీదుగా వెళ్లనున్నాయి.

News January 3, 2025

రోహిత్ రెస్ట్ తీసుకుంటున్నారా? తప్పించారా?

image

BGT 5వ టెస్టులో రోహిత్‌కు బదులు బుమ్రా టాస్‌కు రావడం ఫ్యాన్స్‌ను షాక్‌కు గురి చేసింది. నిన్న IND జట్టులో మార్పులుంటాయని, రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి తప్పిస్తారని ఊహాగానాలొచ్చిన విషయం తెలిసిందే. వాటిని నిజం చేస్తూ రోహిత్ జట్టులో లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. బుమ్రా చెప్పినట్లు హిట్ మ్యాన్ తాను ‘ఆడను, రెస్ట్ తీసుకుంటా’ అని చెప్పారా? కావాలనే జట్టు నుంచి తప్పించారా? అనే అంశం చర్చనీయాంశమైంది.