News October 29, 2024
సముద్రంలో నేవీ సైనికులకు WiFi
హైస్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీని అందిస్తోన్న స్టార్‌లింక్ నేవీ సైనికులకు వైఫై సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఎర్ర సముద్రంలో ఒత్తిడిలో ఉండే సైనికులకు ఇది కాస్త ఉపశమనం ఇవ్వనుంది. ‘USS ఐసెన్‌హోవర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో యుద్ధ బృందంలోని నావికులకు ఈ WiFi కనెక్టివిటీ మనోధైర్యాన్ని ఇచ్చింది’ అని నేవీ కెప్టెన్ క్రిస్ చౌదా హిల్ చేసిన వ్యాఖ్యలు వైరలయ్యాయి. దీనికి ‘కూల్’ అంటూ ఎలాన్ మస్క్ రిప్లై ఇచ్చారు.
Similar News
News October 31, 2024
ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణకు సిద్ధమే.. కానీ: ఖాసిమ్
నస్రల్లా స్థానంలో హెజ్బొల్లా చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన నయీమ్ ఖాసిమ్ తొలిసారి ప్రసంగించారు. ఇజ్రాయెల్‌పై పోరాడుతూనే ఉంటామని ప్రకటించారు. ఆ దేశం దురాక్రమణను ఆపి తమకు అనుకూలమైన షరతులకు ఒప్పుకుంటే కాల్పుల విరమణకు సిద్ధమేనని తెలిపారు. అందుకోసం తామేమీ అడుక్కోబోమని స్పష్టం చేశారు. నస్రల్లా అనుసరించిన వార్ ప్లాన్‌కు కట్టుబడి ఉంటామన్నారు. కాగా ఈ కొత్త చీఫ్ ఎంతో కాలం ఉండరని ఇజ్రాయెల్ హెచ్చరించింది.
News October 31, 2024
విక్రయాల్లో ‘వివో’.. విలువలో ‘శాంసంగ్’ టాప్
భారత్‌లో స్మార్ట్ ఫోన్ విక్రయాల పరంగా 19.4% వాటాతో వివో అగ్రస్థానంలో నిలిచినట్లు కౌంటర్ పాయింట్ రీసెర్చ్ సంస్థ వెల్లడించింది. ప్రస్తుత క్యాలెండర్ ఇయర్ మూడో క్వార్టర్ గణాంకాలను అది వెలువరించింది. ఆ తర్వాత షావోమి(16.7%), శాంసంగ్(15.8%), ఒప్పో(13.4%), రియల్మీ(11.3%) ఉన్నాయంది. ఇక విక్రయాల్లో విలువపరంగా 22.8% వాటాతో శాంసంగ్ టాప్‌లో ఉన్నట్లు తెలిపింది. రెండో స్థానంలో యాపిల్(21.8%) ఉన్నట్లు పేర్కొంది.
News October 31, 2024
ఏపీలో మరో రెండు బీసీ గురుకులాలు
AP: రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 107 బీసీ గురుకులాలు ఉండగా మరో రెండు కొత్త గురుకులాలను ప్రభుత్వం అందుబాటులోకి తెస్తోంది. శ్రీసత్యసాయి జిల్లా రాంపురం(పెనుకొండ), నెల్లూరు జిల్లా ఆత్మకూరులో అద్దె భవనాల్లో వీటిని ప్రారంభించనుంది. 5, 6, 7, 8 తరగతుల విద్యార్థులతో 240 సీట్లను కేటాయించింది. పెనుకొండలో సీట్ల భర్తీ పూర్తయ్యింది. ఆత్మకూరులో ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది.