News October 29, 2024
HYDలో ఆంక్షలు.. ఈ ప్రాంతాల్లో జాగ్రత్త!

TG: HYDలో NOV 28 వరకు 163(పాత 144) సెక్షన్ అమలులో ఉంటుందని పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సమయంలో బహిరంగ ప్రదేశాల్లో సమావేశాలు, నిరసనలు నిర్వహించకూడదన్నారు. ప్లకార్డులు, ఫొటోలు, గుర్తులు ప్రదర్శించడంపైనా నిషేధం ఉంటుంది. ధర్నాచౌక్ వద్ద మాత్రం ధర్నాలు, నిరసనలు చేసుకోవచ్చు. ముఖ్యంగా Sec-bad, సచివాలయం వంటి మరికొన్ని సున్నిత ప్రాంతాల్లో ఆందోళనలు చేస్తే వారిపై చర్యలుంటాయన్నారు.
Similar News
News February 2, 2026
గోధుమ పిండి దీపంతో వివాదాల పరిష్కారం

అనుకోని వివాదాలు, కోర్టు సమస్యల్లో ఇరుక్కున్నప్పుడు గోధుమ పిండితో చేసిన దీపం వెలిగించడం శ్రేయస్కరం. ఈ దీపారాధన వల్ల శత్రు చికాకులు తొలగిపోతాయి. జాతకంలో సూర్య గ్రహ దోషాలు ఉన్నా, అధికారులతో ఇబ్బందులు ఎదురైనా గోధుమ పిండి దీపం ఉపశమనాన్ని ఇస్తుంది. మనశ్శాంతిని ప్రసాదించి, క్లిష్ట పరిస్థితుల నుంచి మిమ్మల్ని బయటపడేస్తుంది. సమస్యల తీవ్రత తగ్గాలనుకునే వారు ఈ దీపాన్ని క్రమం తప్పకుండా వెలిగించాలి.
News February 2, 2026
జార్జియాలో ‘వారణాసి’ షూటింగ్!

రాజమౌళి దర్శకత్వంలో మహేష్‌బాబు, ప్రియాంకా చోప్రా జంటగా రూపొందుతున్న చిత్రం ‘వారణాసి’. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ సినిమా తర్వాతి షెడ్యూల్ జార్జియాలో మొదలుకానున్నట్లు తెలుస్తోంది. డెరెక్టర్ రాజమౌళి దీనికి సంబంధించి ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేశారట. అలాగే మరో కీలక షెడ్యూల్‌ను అంటార్కిటికాలో చిత్రీకరిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా 2027 ఏప్రిల్ 7న రిలీజ్ కానుంది.
News February 2, 2026
పెసరపిండి దీపం ఎందుకు వెలిగించాలంటే..?

ఇంట్లో దారిద్ర్యం తొలగి, లక్ష్మీదేవి కటాక్షం కలగాలంటే పెసరపిండి దీపం వెలిగించాలి. ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే వారు ఈ దీపారాధన చేయడం వల్ల సుఖశాంతులు చేకూరుతాయి. పెసరపిండి దీపం బుధ గ్రహానికి ప్రీతికరమైనది, కాబట్టి ఇది వ్యాపార అభివృద్ధికి కూడా తోడ్పడుతుంది. నిత్యం పేదరికం వేధిస్తున్నా, సంపాదన నిలకడగా లేకపోయినా ఈ దీపాన్ని వెలిగిస్తే అద్భుతమైన మార్పులు కనిపిస్తాయని పండితులు చెబుతున్నారు.


