News October 29, 2024

ప్రభుత్వం కబుర్లు చెబుతోంది: BRS

image

TG: రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రాష్ట్రాన్ని నడపాల్సిన పనిని మరిచిపోయి ప్రజలకు కబుర్లు చెప్పడంలో బిజీగా మారిందని ప్రతిపక్ష BRS సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చితికిపోయిందని, ఆయన అసమర్థత రాష్ట్రాన్ని నాశనం చేస్తోందని దుయ్యబట్టింది. రెవెన్యూ టార్గెట్ రూ.2.74లక్షల కోట్లు కాగా 6 నెలల్లో కేవలం రూ.1.08లక్షల కోట్లు మాత్రమే సాధించినట్లు పేర్కొంది.

Similar News

News October 31, 2024

English Learning: Antonyms

image

✒ Barren× Damp, Fertile
✒ Bawdy× Decent, Moral
✒ Bind× Release
✒ Batty× Sane
✒ Benevolent× Malevolent, Miserly
✒ Befogged× Clear headed, Uncloud
✒ Base× Summit, Noble
✒ Benign× Malignant, Cruel
✒ Busy× Idle, Lazy

News October 31, 2024

అరటి పండ్లు తింటే జలుబు, దగ్గు వస్తుందా?

image

అరటిపండ్లలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఏడాది పొడవునా లభించే ఈ పండ్లను ప్రతి ఒక్కరూ తింటుంటారు. వీటిని తినడం వల్ల జలుబు, దగ్గు వస్తుందని కొందరనుకుంటారు. కానీ అరటిని తినడం వల్ల జలుబు, దగ్గు రాదని వైద్యులు చెబుతున్నారు. వాతావరణంలో వచ్చిన మార్పుల వల్లే అవి వస్తాయి. అప్పటికే వాటితో బాధపడుతున్నవారు తింటే కఫం పెరుగుతుంది. వీటిలో పొటాషియం, ఫైబ‌ర్ స‌మృద్ధిగా ఉంటాయి. ఇవి జీర్ణ‌క్రియ‌ను మెరుగు ప‌రుస్తాయి.

News October 31, 2024

దేనికి లాలూచీపడి ఈ పనికి ఒడిగట్టారు బాబూ?: జగన్

image

AP: పోలవరం ప్రాజెక్టు ఎత్తును 41.15Mకే కేంద్రం <<14486841>>పరిమితం<<>> చేస్తున్నా CM చంద్రబాబు ఎందుకు నోరు మెదపడం లేదని YS జగన్ ప్రశ్నించారు. ‘దేనికి లాలూచీపడి ఈ పనికి ఒడిగట్టారు? NDAలో ఉండి ఎందుకు అభ్యంతరం చెప్పలేదు? ఎత్తు తగ్గింపు వల్ల కుడి, ఎడమ కాల్వలకు పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేయలేం. పంటలకు స్థిరంగా నీళ్లు ఇవ్వలేం. విశాఖ తాగు నీరు, పారిశ్రామిక అవసరాలను తీర్చలేం’ అని ట్వీట్ చేశారు.