News October 29, 2024
చంద్రబాబు చరిత్ర అదే: వైసీపీ
AP: గతంలో ఛార్జీలు పెంచడం అన్యాయమన్న ప్రజలపై బషీర్‌బాగ్‌లో గుర్రాలతో తొక్కించి, తుపాకీలతో కాల్చిన చరిత్ర చంద్రబాబుదని వైసీపీ విమర్శించింది. ఆయనకు ప్రజలంటే లెక్కలేదని, ప్రశ్నిస్తే కాల్చి పారేస్తాడని ట్వీట్ చేసింది. ఆనాడు జనరల్ డయ్యర్, నేడు చంద్రబాబు ఒక్కటేనని పేర్కొంది. 4 నెలలకే CBN పాలన ఇలా ఉంటే నాలుగేళ్లు ఎలా భరించాలని ప్రజలు బాధపడుతున్నారని రాసుకొచ్చింది.
Similar News
News January 3, 2025
జియో రూ.40,000 కోట్ల IPO
రిలయన్స్ జియో IPOకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. దీని ద్వారా రూ.40,000 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇదే జరిగితే స్టాక్ మార్కెట్ చరిత్రలో అతిపెద్ద IPOగా రిలయన్స్ జియో పేరు నిలిచిపోతుంది. ఇందుకోసం సంస్థ విలువను రూ.10లక్షల కోట్లుగా చూపించనున్నట్లు తెలుస్తోంది. మే/జూన్ తర్వాత ఈ IPO మార్కెట్లోకి వచ్చే ఛాన్సుంది.
News January 3, 2025
BREAKING: కష్టాల్లో భారత్
ఆసీస్‌తో జరుగుతున్న 5వ టెస్టులో భారత్ కష్టాల్లో పడింది. 72 పరుగులకే కీలకమైన 4 వికెట్లను కోల్పోయింది. లంచ్ బ్రేక్‌కు మూడు వికెట్లు పడగా, ఆ తర్వాత బోలాండ్ బౌలింగ్‌లో ఎప్పటిలాగే కోహ్లీ(17) స్లిప్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆఫ్ సైడ్ వెళ్లే బంతిని అనవసర షాట్‌కు యత్నించి విరాట్ వికెట్ సమర్పించుకున్నాడు. ప్రస్తుతం క్రీజులో పంత్(9), జడేజా(0) ఉన్నారు. ప్రస్తుతం భారత్ స్కోరు 76/4.
News January 3, 2025
8న విశాఖలో రైల్వేజోన్‌కు ప్రధాని శంకుస్థాపన
AP: PM మోదీ 8న విశాఖపట్నంలో రైల్వేజోన్ ఏర్పాటుకు శంకుస్థాపన చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఆ రోజు నగరంలోని సంపత్ వినాయక టెంపుల్ నుంచి AU ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్‌లోని సభా ప్రాంగణం వరకు మోదీ రోడ్ షో నిర్వహించనున్నారు. పూడిమడకలో NTPC ఇంటిగ్రేటెడ్ గ్రీన్ హైడ్రోజన్ హబ్, కృష్ణపట్నం ఇండస్ట్రీయల్ హబ్, నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్, తదితర అభివృద్ధి పనులకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు.