News October 29, 2024
ప్రకాశం జిల్లాలో రేపు మంత్రి రాక.!

ప్రకాశం జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఈనెల 30న జిల్లా పర్యటన నిమిత్తం ఒంగోలు నగరానికి రానున్నారు. ఈ సందర్భంగా నగరంలోని టీడీపీ కార్యాలయంలో ప్రకాశం జిల్లా కూటమి నేతల సమన్వయ కమిటీ సమావేశం నిర్వహిస్తారు. ఈ విషయాన్ని టూరిజం డెవలప్మెంట్ ఛైర్మన్ నూకసాని బాలాజీ తెలిపారు. ఈ సమావేశానికి జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పోరేషన్ ఛైర్మన్‌లు, కూటమి నాయకులు హాజరవుతారు.
Similar News
News January 13, 2026
ఒంగోలులో బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు సస్పెండ్

ఒంగోలులోని యాదవ మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో SGTగా పనిచేస్తున్న ఉపాధ్యాయుడు శ్రీనివాసరావును విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు DEO రేణుక తెలిపారు. ఈ మేరకు DEO కార్యాలయం మంగళవారం ప్రకటన విడుదల చేసింది. ఉపాధ్యాయుడు పాఠశాలలో బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, గైర్హాజరైన విద్యార్థుల అటెండెన్స్ వేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నట్లు అందిన నివేదిక మేరకు చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.
News January 13, 2026
సింగరాయకొండలో చైనా మాంజా తగిలి ఉద్యోగికి గాయాలు

చైనా మాంజా తగిలి ఉద్యోగికి గాయాలైన ఘటన మంగళవారం సింగరాయకొండలో చోటుచేసుకుంది. బాధితుడు, పోస్ట్‌మ్యాన్ గోపి వివరాల మేరకు.. ఉదయాన్నే ఉత్తరాల బట్వాడా చేసే సమయంలో గాలిపటానికి ఉపయోగించే చైనా మాంజా దారం మెడకు తగిలి గాయాలయ్యాయి. స్థానికులు ఆసుపత్రికి తరలించారు. మాంజ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అధికారులు ప్రజలను అప్రమత్తం చేయాలని కోరారు.
News January 13, 2026
త్రిపురాంతకం హైవేపై రోడ్డు ప్రమాదం.!

త్రిపురాంతకం మండలంలోని ముడివేముల సమీపంలో జాతీయ రహదారిపై మంగళవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కూరగాయల లోడుతో వెళ్తున్న ఆటో- బొలెరో వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కూరగాయల ఆటోలో ఉన్న పలువురికి గాయాలు కాగా.. క్షతగాత్రులను హైవే అంబులెన్స్ సహాయంతో వినుకొండకు తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


