News October 29, 2024

ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు నాలుగు రోజులు సెలవు

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు ఈ నెల 31 నుంచి నవంబర్ 3వ తేదీ వరకు సెలవులు ప్రకటిస్తున్నట్లు మార్కెట్ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. 31న దీపావళి, నవంబర్ 1న అమావాస్య, నవంబర్ 2,3 తేదీల్లో వారంతపు సెలవులు కారణంగా వరుసగా నాలుగు రోజులు సెలవులు ప్రకటిస్తున్నట్లు చెప్పారు. తిరిగి నవంబర్ 4వ తేదీ నుంచి మార్కెట్లో క్రయవిక్రయాలు యధావిధిగా కొనసాగుతాయని పేర్కొన్నారు. రైతులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.

Similar News

News December 24, 2025

అధికారుల నిర్లక్ష్యం సహించం.. ప్రజా సంక్షేమమే లక్ష్యం: Dy.CM

image

అధికారుల నిర్లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని Dy.CM భట్టి విక్రమార్క అన్నారు. బుధవారం ఖమ్మం కలెక్టరేట్లో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజా ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రతి సంక్షేమ, అభివృద్ధి పథకం అనుకున్న లబ్ధిదారుడికి చేరేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. సంవత్సరాల తరబడి పెండింగ్‌లో ఉన్న బిల్లులను ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నామని పేర్కొన్నారు.

News December 24, 2025

ప్రజలకు వేగవంతమైన సేవలు అందించాలి: భట్టి

image

రెవెన్యూ సేవల్లో నాణ్యతను మరింత మెరుగుపరచాలని, ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని Dy.Cm భట్టి విక్రమార్క రెవెన్యూ ఉద్యోగులకు సూచించారు. ఇటీవల ఎన్నికైన తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా యూనిట్‌ నూతన పాలకవర్గ సభ్యులు బుధవారం Dy.Cm ను కలిశారు. ప్రజల సమస్యల పరిష్కారంలో రెవెన్యూ యంత్రాంగం కీలక పాత్ర పోషించాలని సూచించారు.

News December 24, 2025

ఖమ్మం: సర్పంచ్‌లకు ‘పంచాయతీ’ పాఠాలు

image

ఖమ్మం కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు, వార్డు సభ్యులకు పంచాయతీరాజ్ చట్టంపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. జనవరి 5 నుంచి 9 వరకు హైదరాబాద్‌లో మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ ఇవ్వనున్నారు. జిల్లా నుంచి ఎంపికైన 33 మంది అధికారులు శిక్షణ పొంది, అనంతరం సర్పంచ్‌లకు విధులు, నిధుల వినియోగంపై అవగాహన కల్పిస్తారు. పారదర్శక పాలనే లక్ష్యంగా జిల్లా అధికారులు ఈ ఏర్పాట్లు చేస్తున్నారు.