News October 29, 2024

హైకోర్టులో వైసీపీ ఎంపీకి ఊరట

image

AP: పుంగనూరు అల్లర్ల కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఊరట లభించింది. ఆయనతో పాటు మరో ఐదుగురికి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

Similar News

News January 13, 2026

టాక్సిక్ టీజర్ వివాదం.. సెన్సార్ సర్టిఫికెట్ అవసరం లేదన్న CBFC

image

కన్నడ స్టార్ యశ్ నటించిన టాక్సిక్ మూవీ టీజర్ వివాదాస్పదమైన విషయం తెలిసిందే. అశ్లీల సన్నివేశాలపై ఆప్ <<18843954>>ఫిర్యాదు<<>> చేయడంతో వివరణ ఇవ్వాలని సెన్సార్ బోర్డుకు కర్ణాటక మహిళా కమిషన్‌ లేఖ రాసింది. దీంతో యూట్యూబ్‌లో విడుదల చేసే టీజర్లకు సెన్సార్ సర్టిఫికెట్ అవసరం లేదని CBFC తెలిపింది. థియేటర్లలో ప్రదర్శించే వాటికే పర్మిషన్ అవసరమని, యూట్యూబ్ డిజిటల్ ప్లాట్‌ఫాం కావడంతో తమ పరిధిలోకి రాదని చెప్పింది.

News January 13, 2026

670 సార్లు అప్లై చేసినా పట్టించుకోలేదు.. కట్ చేస్తే..

image

ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడం కంటే తెలివితక్కువ పని ఇంకోటి లేదంటున్నారో టెకీ. ‘రిక్రూటర్లకు 670 అప్లికేషన్లు, 1000 మెసేజ్‌లు పంపినా పట్టించుకోలేదు. దీంతో దరఖాస్తులు ఆపేశా. వ్యక్తిగతంగా ప్రొడక్ట్ బిల్డింగ్, కంటెంట్ క్రియేషన్, నెట్‌వర్కింగ్‌పై ఫోకస్ చేశా. జనవరి-మే మధ్య 83మంది రిక్రూటర్లు సంప్రదించారు’ అని మర్మిక్ పటేల్ అనే వ్యక్తి తెలిపారు. మెటాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నట్లు చెప్పారు.

News January 13, 2026

నెలసరికి ముందు రొమ్ము నొప్పా?

image

నెలసరికి ముందు వక్షోజాల్లో నొప్పి, బరువుగా ఉన్నట్లు అనిపించడం లాంటి సమస్య చాలా మందిలో కనిపిస్తుంది. దీన్ని ‘ప్రీ మెన్‌స్ట్రువల్‌ మాస్టాల్జియా’గా పిలుస్తారు. ఒక వయసు వచ్చాక అండం విడుదల సమయంలో వెలువడే ప్రొజెస్టిరాన్‌ హార్మోన్‌ ఈ నొప్పికి కారణం. అయితే ఈ నొప్పి బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణం ఏమో అని చాలా మంది భయపడతారు. కానీ అది అపోహే అంటున్నారు నిపుణులు. నొప్పి మరీ ఎక్కువగా ఉంటే వైద్యులను సంప్రదించాలి.