News October 29, 2024

కృష్ణుడిగా మహేశ్ బాబు.. నిజమిదే!

image

‘దేవకీ నందన వాసుదేవ’ సినిమాలో సూపర్ స్టార్ మహేశ్ బాబు కృష్ణుడి పాత్రలో కనిపిస్తారని వార్తలొచ్చిన విషయం తెలిసిందే. కానీ, ఇవన్నీ పూర్తిగా అవాస్తవమని, ఆయన ఎలాంటి పాత్రలో నటించడం లేదని సినీవర్గాలు క్లారిటీ ఇచ్చాయి. మూవీ టీమ్ అలాంటి ప్లాన్ కూడా చేయలేదని తెలిపాయి. రాజమౌళి సినిమా కోసమే మహేశ్ సిద్ధమవుతున్నారని, లుక్ కూడా ఆ చిత్రం కోసమేనని వెల్లడించాయి. కాగా, SSMB29 షూటింగ్ వచ్చే ఏడాది మొదలవుతుంది.

Similar News

News November 12, 2025

ఇంద్రకీలాద్రిపై రూ.500 టికెట్లు రద్దు

image

కార్తీకమాసం ముగింపు నేపథ్యంలో, విజయవాడ ఇంద్రకీలాద్రిపై రూ.500 ప్రత్యేక దర్శనం టిక్కెట్ల విక్రయాన్ని అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని, ఈ నెల 14, 15, 16 తేదీలలో ప్రతిరోజూ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు ఈ టిక్కెట్ల విక్రయం నిలిపివేయబడుతుందని తెలిపారు.

News November 12, 2025

ఒకే వేదికపైకి రష్మిక, విజయ్..! అధికారికంగా ప్రకటిస్తారా?

image

ప్రేమ, త్వరలో పెళ్లి వార్తల వేళ హీరోయిన్ రష్మిక మందన్న, హీరో విజయ్ దేవరకొండ ఇవాళ ఒకే వేదికపై కనిపించనున్నట్లు తెలుస్తోంది. రష్మిక నటించిన ‘ది గర్ల్‌ఫ్రెండ్’ మూవీ సక్సెస్ మీట్ హైదరాబాద్‌లో జరగనుంది. దీనికి విజయ్ చీఫ్ గెస్ట్‌గా వస్తారని సమాచారం. ఈ వేదికగా తమ పెళ్లి గురించి అధికారికంగా ప్రకటిస్తారేమోనని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

News November 12, 2025

బిలియనీర్ల అడ్డా ముంబై, ఢిల్లీ!

image

ప్రపంచంలో ఎక్కువ మంది బిలియనీర్లు ఉండే టాప్-10 నగరాల జాబితాలో ముంబై, ఢిల్లీ చోటు దక్కించుకున్నాయి. 119 మంది కుబేరులతో న్యూయార్క్ టాప్‌లో ఉందని హురున్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ నివేదిక వెల్లడించింది. ఆ తర్వాత లండన్(97), ముంబై(92), బీజింగ్(91), షాంఘై(87), షెంజెన్(84), హాంకాంగ్(65), మాస్కో(59), ఢిల్లీ(57), శాన్‌ఫ్రాన్సిస్కో(52) ఉన్నాయి.