News October 29, 2024

పోలీసులకు తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయి: RSP

image

TG: సీఎం రేవంత్ భద్రతా సిబ్బందిలో బెటాలియన్ పోలీసులను తొలగించడాన్ని BRS నేత RS ప్రవీణ్ కుమార్ తప్పుబట్టారు. ‘ఇంత ఘోరమైన పరిస్థితులు వస్తాయని నేను కలలో కూడా ఊహించలేదు. సీఎం రేవంత్.. అర్జంటుగా మౌనం వీడి బెటాలియన్లకు వెళ్లండి. కానిస్టేబుళ్ల కుటుంబాలతో మాట్లాడండి. మీ అనాలోచిత చర్యల వల్ల పోలీసులకు తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయి. అంతర్గత భద్రతకు సంబంధించి ఇది సీరియస్ ఇష్యూ’ అని ట్వీట్ చేశారు.

Similar News

News October 30, 2024

ALERT.. రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

image

తెలంగాణలోని పలు జిల్లాల్లో రేపు వర్షాలు పడతాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, NZB, జగిత్యాల, సిరిసిల్ల, KRMR, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, NLG, SRPT, MHBD, WL, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, HYD, మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

News October 30, 2024

దీపావళి: ప్రజలకు అలర్ట్ మెసేజ్‌లు

image

టపాసులు కాల్చేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని APSDMA పేర్కొంది. ప్రజల మొబైల్స్‌కు అలర్ట్ మెసేజ్‌లు పంపుతోంది. ‘అగ్నిప్రమాదం జరిగితే అత్యవసర సహాయం కోసం 101, 112, 100, 1070 టోల్ ఫ్రీ నంబర్లను సంప్రదించండి. బాణసంచా కాల్చే సమయంలో కాటన్ దుస్తులు ధరించండి. ఇంటి కిటికీలు, తలుపులు మూసేయండి. పెద్దల పర్యవేక్షణలో పిల్లలు టపాసులు కాల్చాలి. టపాసులు వెలిగించి విచక్షణా రహితంగా విసరకండి’ అని మెసేజ్ పంపుతోంది.

News October 30, 2024

సల్మాన్‌ను చంపేస్తానని బెదిరింపులు.. నిందితుడి అరెస్ట్

image

సల్మాన్ ఖాన్‌ను చంపేస్తానని బెదిరించిన నిందితుడిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.2Cr ఇవ్వకపోతే సల్మాన్‌ను చంపేస్తానని ట్రాఫిక్ కంట్రోల్ రూమ్‌కు మెసేజ్ వచ్చింది. విచారణ చేపట్టిన పోలీసులు బాంద్రాలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. తరచూ సల్మాన్‌‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు వస్తున్నాయి. అయితే తాజాగా పట్టుబడిన నిందితుడికి ఆ గ్యాంగ్‌తో సంబంధాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.