News October 29, 2024

నాగిరెడ్డిపేట్: అనారోగ్యంతో ఉపాధ్యాయుడి మృతి

image

నాగిరెడ్డిపేట మండలం మాసంపల్లి గ్రామంలో యాదగిరి అనే ఉపాధ్యాయుడు అనారోగ్యంతో మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. యాదగిరి నాలుగు నెలల క్రితం వెలువడిన గురుకుల పాఠశాల ఫలితాల్లో ఉద్యోగం సాధించి లింగంపేట మహాత్మా గాంధీ జ్యోతిబాపూలే పాఠశాలలో విధులు నిర్వహించాడని, ఇటీవల వెలువడిన డీఎస్సీ ఫలితాల్లో గణిత విభాగంలో జిల్లాలో మొదటి ర్యాంకు సాధించి లింగంపేట బాలుర ఉన్నత పాఠశాలలో గణిత టీచర్గా విధుల్లో చేరాడన్నారు.

Similar News

News December 28, 2025

NZB: చెట్టుకు ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య

image

నిజామాబాద్ నగరంలోని గూపన్ పల్లి శివారులో చెట్టుకు ఉరేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు రూరల్ టౌన్ ఎస్‌హెచ్ఓ శ్రీనివాస్ తెలిపారు. గ్రామానికి చెందిన చింతల ఏడ్డి రాజన్న(50) గత కొన్నిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ శనివారం గ్రామ శివారులోని చెట్టుకు ఉరేసుకున్నట్లు చెప్పారు. మృతుని భార్య పదేళ్ల క్రితం మృతి చెందింది. ఆయనకు ముగ్గురు కూతుర్లు ఉన్నారు.

News December 28, 2025

NZB: రోడ్డు ప్రమాదాల నివారణకు విస్తృత స్థాయిలో అవగాహన

image

రోడ్డు ప్రమాదాల నియంత్రణ కోసం విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను విధిగా పాటిస్తే, ప్రమాదాలకు ఆస్కారం ఉండదని అన్నారు. కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో కలెక్టర్ అధ్యక్షతన రోడ్డు భద్రతా కమిటీ సమావేశం జరిగింది. నేషనల్ హైవే అథారిటీ, ఆర్అండ్‌బీ, రవాణా శాఖ, ఆర్టీసీ, పంచాయతీ రాజ్, విద్యుత్ అధికారులు పాల్గొన్నారు.

News December 27, 2025

NZB: 129 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు: ఇన్‌ఛార్జ్ CP

image

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వారం రోజుల్లో 129 డ్రంక్ అండ్ డ్రైవ్‌ కేసులు నమోదైనట్లు ఇన్‌ఛార్జ్ పోలీస్ కమిషనర్ రాజేశ్ చంద్ర తెలిపారు. వీరందరినీ కోర్టులో హాజరు పరిచినట్లు చెప్పారు. న్యాయమూర్తి 129 మందికి రూ.8.80 లక్షల జరిమానా వేసినట్లు పేర్కొన్నారు. అలాగే 10 మందికి వారం రోజుల చొప్పున జైలు శిక్ష విధించారని వెల్లడించారు.