News October 29, 2024

భీమవరం కుర్రాడిని కలుస్తానన్న మంత్రి లోకేశ్

image

భీమవరానికి చెందిన యువకుడు యేసు భీమవరం నుంచి సైకిల్‌పై లద్దాక్‌కు 3500 కి.మీ. ప్రయాణించి ఎక్స్‌లో పోస్టు చేశారు. దానిపై మంత్రి లోకేశ్ స్పందించారు. ‘నేను ఇండియాకి వచ్చాక నిన్ను కలుస్తాను. సవాలుతో కూడిన నీ ప్రయాణం విజయవంతంగా ముగిసినందుకు అభినందనలు. ఇలాగే పట్టుదలతో నువ్వు లక్ష్యాన్ని చేరుకోవడాన్ని కొనసాగించు’ అని మంత్రి రిప్లై ఇచ్చారు.

Similar News

News October 31, 2024

ఉండ్రాజవరం: పిడుగుపాటు మరణాలపై సీఎం విచారం

image

ఉండ్రాజవరం మండలం సూర్యరావుపాలెంలో బాణసంచా కేంద్రంపై పిడుగు పడి ఇద్దరు మృతి చెందిన ఘటనపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. మృతి చెందిన వెగిరోతు శ్రీవల్లి, గుమ్మడి సునీత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ప్రమాదంలో గాయపడిన ఐదుగురికి మెరుగైన వైద్యం అందించాలని, క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తనకు తెలియజేయాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు.

News October 31, 2024

పాలకోడేరులో సందడి చేస్తున్న అమెరికా పావురాలు

image

పాలకోడేరు మండలం మోగల్లులో అమెరికా పావురాలు సందడి చేస్తున్నాయి. గ్రామానికి చెందిన కంకిపాటి జోసఫ్‌ రెండు నెలల క్రితం తణుకు పట్టణం నుంచి రెండు పావురాలను కొనుగోలు చేసినట్లు చెప్పారు. వాటిని అమెరికా పావురాలు అంటారని, ఎవరు దగ్గరకు తీసుకొన్నా వారితో మమేకం అవుతాయని ఆయన చెప్పారు. పెసలు, కొర్రలు వాటికి ఆహారంగా పెడుతున్నామని జోసేఫ్ వివరించారు.

News October 31, 2024

ఉండ్రాజవరం: బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా

image

ఉండ్రాజవరం మండలం సూర్యారావు పాలెం గ్రామంలో బుధవారం జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు ఆర్థిక సాయం రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. బాణసంచా తయారీ కేంద్రంలో పిడుగు పాటుపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఐదుగురు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.