News October 29, 2024
వారంతా ఆయుష్మాన్ కార్డు తీసుకోవాలి: PM

దేశంలో 70ఏళ్లు దాటిన వారంతా ఆయుష్మాన్ భారత్ కార్డు తీసుకోవాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఈ కార్డుతో వృద్ధులంతా ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్య చికిత్స పొందవచ్చన్నారు. ఢిల్లీ, బెంగాల్ వంటి కొన్ని రాష్ట్రాలకు ఆయుష్మాన్ సేవలు అందడం లేదని, ఆయా రాష్ట్రాల వైఖరి వృద్ధులకు శాపంగా మారిందన్నారు. ఆ రాష్ట్రాల రాజకీయాల కారణంగా లబ్ధి పొందలేని వృద్ధులకు మోదీ క్షమాపణలు చెప్పారు.
Similar News
News February 11, 2026
MLAల ప్రసంగాలు వింటా.. మంత్రుల సమాధానాలు చూస్తా: CBN

AP: 20నెలల కూటమి పాలనలో విభేదాలు లేవని CM CBN అన్నారు. ‘మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం. నిబద్ధత లేకపోతే ఫలితాలు రావు. పెండింగ్ పనులను నా దృష్టికి తీసుకురండి. జిల్లాల వారీగా నేతలు, అధికారులతో సమావేశం పెడతా. అసెంబ్లీ సమావేశాలను సీరియస్‌గా తీసుకోవాలి. 9am-1pm వరకు సభ్యులంతా సభలో ఉండాలి. MLAల ప్రసంగాలు వింటా..మంత్రుల సమాధానాలు చూస్తా. అసెంబ్లీని నేను కూడా పూర్తిగా గమనిస్తా’ అని CM చెప్పారు.
News February 11, 2026
శివరాత్రి స్పెషల్.. RTC బస్సు ఛార్జీల పెంపు

శివరాత్రి సందర్భంగా TGSRTC 2,243 స్పెషల్ బస్సులు నడుపుతోంది. వీటిలో శ్రీశైలానికి 781, వేములవాడకు 416, కీసరకు 326 ఉన్నాయి. దీంతో స్పెషల్ బస్సుల్లో టికెట్ రేట్లను సంస్థ 1.5రెట్లు పెంచింది. ఈ నెల 14 నుంచి 16 వరకు ఇది అమల్లో ఉండనుంది. రెగ్యులర్ సర్వీసుల్లో ఎలాంటి మార్పు ఉండదు. స్పెషల్ పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌లో మహిళలకు యథావిధిగా ఫ్రీ జర్నీ అమల్లో ఉంటుంది.
News February 11, 2026
IIT హైదరాబాద్‌లో ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఎల్లుండే లాస్ట్ డేట్

ఐఐటీ హైదరాబాద్ 4 ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ అటెండెంట్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు(ఫిబ్రవరి 13) తేదీ. పోస్టును బట్టి బీటెక్, ఇంటర్ అర్హతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. నెలకు జీతం ప్రాజెక్ట్ అసోసియేట్‌కు రూ.25K-రూ.35K,ప్రాజెక్ట్ అటెండెంట్‌కు రూ.20K-25K చెల్లిస్తారు. ఫిబ్రవరి 17న రాత పరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.iith.ac.in


