News October 29, 2024
HYD: BRS కార్యకర్తలకు KTR కీలక సూచనలు

BRS కార్యకర్తలు, సోషల్ మీడియా వారియర్స్‌కు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఈరోజు HYDలో కీలక సూచనలు చేశారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్, BJP, TDP వారి పెయిడ్ సోషల్ మీడియా ట్రోల్స్ BRSను టార్గెట్ చేస్తాయని వెల్లడించారు. తప్పుడు కేసులు, డీప్ ఫేక్ టెక్నాలజీతో అసత్య ప్రచారం చేస్తారని, అలాంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. 6 గ్యారంటీల అమలులో ఫెయిల్ అయినందుకు కాంగ్రెస్‌ను ప్రశ్నించాలన్నారు.
Similar News
News November 3, 2025
మూల మలుపు.. ఓవర్ స్పీడ్ ప్రమాదానికి కారణం?

మీర్జాగూడ ప్రమాదంపై రవాణా శాఖ అధికారులు, పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇటు బస్సు, అటు టిప్పర్ రెండు ఓవర్ స్పీడ్‌తో వచ్చాయని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. దీనికి తోడు ప్రమాదం జరిగిన ప్రాంతంలో మూల మలుపు కూడా ఉందని, దీంతో రెండు వాహనాలు ఢీ కొట్టగానే కంకర మొత్తం ప్రయాణికుల మీదకు వెళ్లిందని స్థానికులు చెబుతున్నారు. కంకర కూడా ఓవర్ లోడ్ కావడంతో.. బరువు పెరిగి అదుపుతప్పినట్లు అంచనా వేస్తున్నారు.
News November 3, 2025
HYD: ఘోరం.. ఉలిక్కపడ్డ మీర్జాగూడ

RTC బస్సు ప్రమాద ఘటనతో మీర్జాగూడ ఉలిక్కిపడింది. ఉ.6 గంటల వరకు అంతా ప్రశాంతంగా ఉంది. హైవే మీద ప్రమాదం జరిగిందని తెలుసుకున్న మీర్జాగూడ, ఇంద్రారెడ్డినగర్, బెస్తపూర్, ఖానాపూర్, కిష్టపూర్ వాసులు ఉలిక్కిపడ్డారు. ఏమైందోనని ఆందోళనతో కొందరు యువకులు ప్రమాద స్థలం వద్దకు చేరుకున్నారు. అప్పటికే రోడ్ల మీద మృతులు, కంకర కింద క్షతగాత్రులను చూసి చలించిపోయారు. కాగా, ఈ బస్సు ప్రమాదంలో 21 మంది మృతి చెందారు.
News November 2, 2025
HYD: KCR వైపే ప్రజలు: మల్లారెడ్డి

KCR వైపే ప్రజలంతా ఉన్నారని మాజీ మంత్రి, మేడ్చల్ MLA మల్లారెడ్డి అన్నారు. ఈరోజు జవహర్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో కాంగ్రెస్‌కు చెందిన 6వ డివిజన్ మాజీ కార్పొరేటర్ పల్లపు రవి, 300 మంది కార్యకర్తలతో కలిసి BRSలో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు వేసి ఆహ్వానించారు. BRS మేడ్చల్ నియోజకవర్గం ఇన్‌ఛార్జ్ మహేందర్ రెడ్డి, నాయకులు కొండల్ ముదిరాజ్, రాజశేఖర్, జిట్టా శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు.


