News October 29, 2024
క్యాబినెట్ విస్తరణ అప్పుడే..: సీఎం రేవంత్

TG: మహారాష్ట్ర ఎన్నికల తర్వాత క్యాబినెట్ విస్తరణ చేపడతామని CM రేవంత్ రెడ్డి తెలిపారు. తనకు అధిష్ఠానం(ఏఐసీసీ)తో గ్యాప్ లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఏఐసీసీ అంటే తానేనని మీడియాతో చిట్‌చాట్‌లో ఆయన పేర్కొన్నారు. రోజులో ఎనిమిది గంటలు మూసీపైనే పని చేస్తున్నానని తెలిపారు. హైడ్రా వల్లే HYDలో రియల్ ఎస్టేట్ పడిపోయిందన్న ప్రచారాన్ని ఖండించారు. దేశవ్యాప్తంగా ‘రియల్’ రంగంలో స్తబ్దత ఏర్పడిందని CM చెప్పారు.
Similar News
News January 1, 2026
పారా మెడికల్ విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలు

AP: పారా మెడికల్ విద్యార్థులు పరీక్షల్లో ఫెయిలైతే ఆ సబ్జెక్టులను యాన్యువల్ ఎగ్జామ్స్‌తో పాటు మళ్లీ రాసేవారు. ఫలితంగా ఏడాదిపాటు వేచి ఉండాల్సి వచ్చి ఉపాధి అవకాశాలు కోల్పోయేవారు. కాగా మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాలతో వారికి 2025-26 నుంచి తొలిసారిగా సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. FEB 2, 3, 4 తేదీల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. ఈనెల 5వ తేదీవరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
News January 1, 2026
కాఫ్ సిరప్ తయారీ, విక్రయ నిబంధనలు కఠినం

‘కోల్డ్రిఫ్’ కాఫ్ సిరప్‌తో MP, రాజస్థాన్‌లలో పిల్లలు మరణించడం తెలిసిందే. దీనిపై WHO హెచ్చరికతో కేంద్రం సిరప్‌ల తయారీ, విక్రయ రూల్స్ కఠినం చేస్తోంది. సిరప్ పదాన్ని షెడ్యూల్ K నుంచి తొలగించింది. కాస్మొటిక్స్‌తో పాటు కాఫ్ సిరప్‌ల తయారీ, విక్రయాలకు ఈ షెడ్యూల్ రూల్స్ వర్తించేవి. ఇకపై ఇతర డ్రగ్స్ కేటగిరీలోకి ఇవి చేరనున్నాయి. ప్రిస్క్రిప్షన్‌పైనే విక్రయించాలని కేంద్రం స్పష్టం చేసింది.
News January 1, 2026
USలో మూతపడనున్న NASA అతిపెద్ద లైబ్రరీ

US మేరీల్యాండ్‌లోని గొడ్డార్డ్ స్పేస్ ఫ్లైట్ సెంటర్‌లో ఉన్న నాసా అతిపెద్ద లైబ్రరీ రేపు మూతపడనుంది. కాస్ట్ కటింగ్ పేరిట ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చేపట్టిన రీఆర్గనైజేషన్ ప్లాన్‌లో భాగంగా దీనిని శాశ్వతంగా క్లోజ్ చేస్తున్నారు. 1959లో స్థాపించిన ఈ లైబ్రరీలో లక్షకుపైగా బుక్స్, డాక్యుమెంట్స్ ఉన్నాయి. 1.270 ఎకరాల్లోని క్యాంపస్‌లో 13 బిల్డింగ్స్, 100కుపైగా సైన్స్ & ఇంజినీరింగ్ ల్యాబ్స్ మూతపడనున్నాయి.


