News October 29, 2024

నెల్లిమర్లలో టీచర్‌పై పోక్సో కేసు నమోదు

image

నెల్లిమర్ల పోలీసు స్టేషన్లో ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిపై మంగళవారం పోక్సో కేసు నమోదైంది. అదే మండలంలోని కొండవెలగాడ ఉన్నత పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న బాలికపై బయాలజీ ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ బి.గణేశ్ తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు.

Similar News

News October 31, 2024

విశాఖలో గూగుల్ క్లౌడ్ డేటా సెంటర్ ఏర్పాటు చేయండి: మంత్రి లోకేశ్

image

ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ అమెరికాలోని గూగుల్ హెడ్‌క్వార్టర్స్‌ను సందర్శించారు. విశాఖలో గూగుల్ క్లౌడ్ సెంటర్ ఏర్పాటు చేయాలని గూగుల్ క్లౌడ్ సీఈవో, వైస్‌ప్రెసిడెంట్‌ను కోరారు. ఏపీలో ఈ- గవర్నెన్స్, డిజిటల్ విద్యకు సహకరించాలని మీటింగ్‌లో ప్రతిపాదించారు. యువతలో నైపుణ్యాభివృద్ధి తోడ్పాటుతో పాటు స్మార్ట్ సిటీ కార్యక్రమాలకు సహకరించాలని మంత్రి లోకేశ్ కోరినట్లు టీడీపీ ట్వీట్ చేసింది.

News October 31, 2024

సింహాచలం ఆలయంలో నేడు నరకాసుర వధ

image

నరక చతుర్దశి సందర్భంగా గురువారం సింహాచలం ఆలయ ప్రాంగణంలో నరకాసుర వధ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆలయ సిబ్బంది ఏర్పాట్లను పూర్తి చేశారు. నరకాసురుడి విగ్రహాన్ని ఒక పల్లకిలోను సింహాద్రి అప్పన్న, శ్రీదేవి, భూదేవి సమేతంగా మరొక వాహనంలోను ఎదురెదురుగా తీసుకువచ్చి నరకాసుర వధ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అనంతరం పెద్ద ఎత్తున బాణసంచా కాలుస్తారు. స్వామివారి దర్శనాలు సాయంత్రం 5 గంటల వరకే లభిస్తాయి.

News October 30, 2024

విజయనగరం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన ఖరారు 

image

నవంబర్ 2న సీఎం చంద్రబాబునాయుడు విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. గత ఐదేళ్లలో తీవ్రంగా దెబ్బతిన్న రహదారుల మరమ్మతు పనులను ఆయన జిల్లానుంచి ప్రారంభించనున్నారు. దీనిలో భాగంగా ఆయన ఆరోజు ఉదయం 10.30 గంటలకు కొత్తవలస మండలం దెందేరు జంక్షన్ వద్ద పనులకు శ్రీకారం చుడతారు. సుమారు రూ.826 కోట్ల వ్యయంతో రాష్ట్ర వ్యాప్తంగా గోతులు పూడ్చే పనులను తమ స్వహస్తాలతో ప్రారంభిస్తారు.