News October 29, 2024

హీరో అక్షయ్ కుమార్ మంచి మనసు

image

అయోధ్యలోని కోతులకు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చి మంచి మనసు చాటుకున్నారు. వానరాలకు ఆహారం అందించేందుకు ఓ ప్రత్యేక వాహనాన్ని ఆయన సమకూర్చారు. దాదాపు 1,200 కోతులకు ప్రతిరోజూ బలవర్ధకమైన ఆహారాన్ని సరఫరా చేసేందుకు ఆయన ఏర్పాట్లు చేశారు. నగరం బయట కొన్ని ప్రదేశాల్లో వాటికి ఫుడ్ అందిస్తారు. తన తల్లిదండ్రులు, మామ రాజేశ్ ఖన్నా పేరు మీదుగా ఈ వాహనాన్ని ఏర్పాటు చేశారు.

Similar News

News October 30, 2024

నవంబర్ 2 నుంచి యాదాద్రిలో కార్తీక మాస పూజలు

image

TG: యాదాద్రి నరసింహ స్వామి క్షేత్రంలో నవంబర్ 2 నుంచి డిసెంబర్ 1 వరకు కార్తీక మాస పూజలు నిర్వహించనున్నట్లు ఈవో భాస్కర్ రావు తెలిపారు. ప్రతి రోజు 6 బ్యాచు‌ల్లో సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేపట్టినట్లు పేర్కొన్నారు. గుట్ట కింద వ్రత మండపంలో ఒకేసారి 2వేల జంటలు పూజలు చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.

News October 30, 2024

వారికి టెన్త్‌లో పాస్ మార్కులు 10 మాత్రమే

image

AP: వచ్చే ఏడాది మార్చి-ఏప్రిల్‌లో జరిగే టెన్త్ పరీక్షలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక అవసరాలు కలిగిన(మెంటల్ బిహేవియర్, ఇంటెలెక్చువల్ డిజేబిలిటీ) విద్యార్థులకు పాస్ మార్కులను 10(గతంలో 35)గా నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ దేవానందరెడ్డి ఉత్తర్వులిచ్చారు. అన్ని సబ్జెక్టుల్లోనూ 10 మార్కులు వస్తే చాలని పేర్కొన్నారు.

News October 30, 2024

నవాబ్ మాలిక్‌కు మద్దతివ్వం: బీజేపీ

image

దావూద్ ఇబ్రహీంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు ఎదుర్కొంటున్న నేత నవాబ్ మాలిక్ NCP(అజిత్ పవార్) తరఫున నామినేషన్ దాఖలు చేశారు. అయితే మాలిక్‌కు తాము మద్దతు ఇవ్వట్లేదని BJP నేతలు తెలిపారు. దావూద్‌తో సంబంధాలు ఉన్నవారికి మద్దతు ఇవ్వబోమని స్పష్టం చేశారు. కూటమి పార్టీలు తమకు నచ్చిన నేతను ఎంపిక చేసుకునే అవకాశం ఉందన్నారు. సిట్టింగ్ స్థానాన్ని వదిలేసిన మాలిక్ మన్ఖుర్డ్-శివాజీ నగర్ నుంచి బరిలో ఉన్నారు.