News October 29, 2024
ఎవరి పర్మిషన్ తీసుకోవాలో చెప్పండి సార్: మంత్రికి మందుబాబు లేఖ
TG: మద్యం తాగడానికి ఎవరి అనుమతి తీసుకోవాలో చెప్పాలని ఓ మందుబాబు మంత్రి పొన్నం ప్రభాకర్‌కు లేఖ రాశారు. ‘మద్యం తాగాలంటే కచ్చితంగా అనుమతి తీసుకోవాలని మీరు చెప్పారు. దీంతో ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీ చేసుకోవాలంటే భయం వేస్తోంది. పర్మిషన్ ఎక్కడ తీసుకోవాలి. CM దగ్గరా? మీ వద్దనా? ఎక్సైజ్ శాఖ వద్దనా? ఒక క్లారిటీ ఇస్తే నా స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుంటా’ అని సదరు మద్యం ప్రియుడు లేఖలో పేర్కొన్నారు.
Similar News
News October 30, 2024
‘పోలవరం’ ఎత్తు 41.15 మీటర్లకే పరిమితం?
AP: పోలవరం ప్రాజెక్టు ఎత్తును 45.72M నుంచి కనీస నీటిమట్టం 41.15Mకే కేంద్రం పరిమితం చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకే ప్రాజెక్టు పూర్తి నిధులిచ్చేందుకు AUG 28న కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఎత్తు తగ్గించడం వల్ల గరిష్ఠంగా 115.44TMCల నిల్వే సాధ్యమవుతుంది. వరద రోజుల్లో మినహా ఆయకట్టుకు నీటిని అందించడం అసాధ్యమని నిపుణులు చెబుతున్నారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాల్సి ఉంది.
News October 30, 2024
నవంబర్ 2 నుంచి యాదాద్రిలో కార్తీక మాస పూజలు
TG: యాదాద్రి నరసింహ స్వామి క్షేత్రంలో నవంబర్ 2 నుంచి డిసెంబర్ 1 వరకు కార్తీక మాస పూజలు నిర్వహించనున్నట్లు ఈవో భాస్కర్ రావు తెలిపారు. ప్రతి రోజు 6 బ్యాచుల్లో సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేపట్టినట్లు పేర్కొన్నారు. గుట్ట కింద వ్రత మండపంలో ఒకేసారి 2వేల జంటలు పూజలు చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.
News October 30, 2024
వారికి టెన్త్‌లో పాస్ మార్కులు 10 మాత్రమే
AP: వచ్చే ఏడాది మార్చి-ఏప్రిల్‌లో జరిగే టెన్త్ పరీక్షలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక అవసరాలు కలిగిన(మెంటల్ బిహేవియర్, ఇంటెలెక్చువల్ డిజేబిలిటీ) విద్యార్థులకు పాస్ మార్కులను 10(గతంలో 35)గా నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ దేవానందరెడ్డి ఉత్తర్వులిచ్చారు. అన్ని సబ్జెక్టుల్లోనూ 10 మార్కులు వస్తే చాలని పేర్కొన్నారు.