News October 29, 2024
విద్యార్థులు పరిశోధనల వైపు ఆసక్తి పెంచుకోండి: ఇన్‌ఛార్జ్ వీసీ
అనంతపురం JNTUలోని మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో మంగళవారం DYNAMECHS-2K24 కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా జేఎన్టీయూ ఇన్‌ఛార్జ్ వీసీ సుదర్శన రావు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. ఇంజినీరింగ్ విద్యార్థులు సాఫ్ట్‌వేర్ రంగం వైపు మాత్రమే కాకుండా.. పరిశోధనల వైపు కూడా ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ చెన్నారెడ్డి, పలువురు ప్రొఫెసర్లు పాల్గొన్నారు.
Similar News
News January 2, 2025
శ్రీ సత్యసాయి కలెక్టర్‌ను కలిసిన ఎస్పీ
శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ చేతన్‌ను ఎస్పీ రత్న గురువారం కలిశారు. పుట్టపర్తిలోని కలెక్టరేట్‌లో ఆయనను కలిసి పుష్పగుచ్ఛాలు అందించారు. పరస్పరం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం జిల్లాలో ప్రస్తుత పరిస్థితులు, శాంతిభద్రతల అంశాలు గురించి చర్చించారు.
News January 2, 2025
ఫూటుగా పెగ్గులెత్తారు!
అనంతపురం జిల్లాలో మందు బాబులు కిక్కుతో 2024కు వీడ్కోలు పలికి.. 2025 సంవత్సరానికి వెల్‌కమ్ చెప్పారు. డిసెంబర్ 31న మద్యం ప్రియులు ఫూటుగా తాగడంతో జిల్లాలో రికార్డు స్థాయి మద్యం అమ్మకాలు జరిగాయి. 24 గంటల్లో ఏకంగా రూ.5.46 కోట్ల లిక్కర్ బిజినెస్ జరిగింది. అనంతపురం జిల్లాలో రూ.3.87 కోట్లు, శ్రీ సత్యసాయి జిల్లాలో రూ.1.59 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ వర్గాలు చెబుతున్నాయి.
News January 2, 2025
ATP: ఒంటరితనమే ఆత్మహత్యకు కారణమా?
అనంతపురంలోని ఓ కళాశాలలో <<15040374>>ఇంటర్<<>> విద్యార్థిని చిన్నతిప్పమ్మ (17) బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే. అందిన వివరాల మేరకు.. బాలిక చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయింది. ఆర్డీటీ సహకారంతో చదువుకుంటోంది. తన జూనియర్ ఓ బాలికతో స్నేహం ఉండగా ఇటీవల వారి మధ్య దూరం పెరిగినట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో ఒంటరితనంగా ఫీలై ఆత్మహత్యకు పాల్పడిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.