News October 29, 2024

ఈ లిస్ట్‌లో మీ మండలం ఉందా?

image

AP: ఖరీఫ్ సీజన్‌లో 5 జిల్లాల్లోని 54 మండలాలను ప్రభుత్వం కరవు మండలాలుగా ప్రకటించింది. వీటిలో 27 తీవ్ర కరవు, మరో 27 మండలాలను మధ్యస్థ కరవు ప్రాంతాలుగా గుర్తించింది. అన్నమయ్య జిల్లాలో 19, చిత్తూరు 16, శ్రీసత్యసాయి 10, అనంతపురం 7, కర్నూలు జిల్లాలో 2 మండలాల్లో కరవు పరిస్థితులు ఏర్పడినట్లు పేర్కొంది. ఈ మండలాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైనట్లు చెప్పింది. పైనున్న ఇమేజ్‌లో మీ మండలం ఉందా?

Similar News

News February 17, 2026

650 ఉద్యోగాలు.. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

image

RBIలో 650 అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ నిన్న ప్రారంభమైంది. మార్చి 8 వరకు <>rbi.org.in<<>>లో అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు 50% మార్కులతో డిగ్రీ పాసై ఉండాలి. స్థానిక భాషలో ప్రావీణ్యం, వర్డ్ ప్రాసెసింగ్‌ నాలెడ్జ్ ఉండాలి. వయోపరిమితి 20-28 ఏళ్లు. SC, STలకు 5yrs, OBC 3yrs, PwBD అభ్యర్థులకు 10-15yrs సడలింపు ఉంది. ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్, లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

News February 17, 2026

బాడీ స్ప్రే ఎక్కువగా వాడుతున్నారా?

image

చెమట నుంచి వచ్చే దుర్వాసనను తప్పించుకునేందుకు కొందరు, మంచి సువాసన కోసం మరికొందరు బాడీ స్ప్రేలు వాడుతుంటారు. అయితే వీటిని ఎక్కువగా వాడటం వల్ల పలు సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. ఇందులో ఉండే ప్రొపిలిన్ గ్లైకాల్ అనే రసాయనం వల్ల దీర్ఘకాలంలో కాంటాక్ట్ డెర్మటైటీస్, హైపర్ పిగ్మెంటేషన్, గ్రాన్యూలోనూ వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఆల్కహాల్, పారాబెన్ లేని వాటిని వాడాలని సూచిస్తున్నారు.

News February 17, 2026

వేరుశనగలో తెగుళ్ల కట్టడికి మరికొన్ని సూచనలు

image

వేరుశనగలో పంట చుట్టూ లేదా పంటలో కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. కంచె పంటగా సజ్జ లేదా జొన్నలను 3-4 వరుసలలో వేసుకోవాలి. వేరుశనగ పంటలో పసుపు, నీలం జిరుగు అట్టలను ఎకరాకు 10 నుంచి 15 చొప్పున పొలంలో అమర్చుకోవాలి. వేరుశనగ పంటలు ఊడలు దిగే సమయంలో ఎకరానికి 200 కిలోల జిప్సం ఎరువును వేసుకోవాలి. ఈ జాగ్రత్తలతో ఆకుమచ్చ తెగులుతో పాటు ఇతర చీడపీడల ఉద్ధృతిని తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.