News October 30, 2024

ఈ పదాలకు అర్థం తెలుసా?

image

హైదరాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్, మార్కాపురం, అనంతపురం.. తెలుగురాష్ట్రాల్లో చాలా ప్రాంతాలకు చివర్లో ఇలా బాద్ లేదా పురం అని కనిపిస్తుంటుంది. ఎందుకంటే.. ఆబాద్ అంటే నివాసం లేదా ఆహారం లభించే నివాసయోగ్యమైన స్థలమని అర్థం. వాటిని స్థాపించిన వారు లేదా ప్రముఖుల పేర్లకు చివర ఆబాద్ పేరిట ప్రాంతాలను పిలుస్తున్నాం. ఇక పురం అంటే పట్టణమని అర్థం. ఈ అర్థంలోనే కొన్ని ఊళ్ల చివర పురం అన్న పదాన్ని వాడటం ప్రారంభమైంది.

Similar News

News February 10, 2026

శ్రీలంక జట్టుకు కీలక ప్లేయర్ దూరం

image

T20 WC జరుగుతున్న వేళ శ్రీలంక జట్టుకు బిగ్ షాక్ తగిలింది. గాయం కారణంగా ఆ జట్టు స్టార్ ప్లేయర్ వనిందు హసరంగ టోర్నీ మొత్తానికి దూరమయ్యారు. అతని ఎడమ కాలి కండరాల్లో చీలిక ఏర్పడినట్లు MRI స్కానింగ్‌లో తేలడంతో జట్టు నుంచి తప్పించారు. హసరంగ స్థానంలో లెగ్ స్పిన్ ఆల్‌రౌండర్ దుషాన్ హేమంతకు జట్టులో చోటు కల్పించారు. 8వ తేదీ ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక గెలుపొందిన విషయం తెలిసిందే.

News February 10, 2026

ఫీజ్ రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల

image

AP: విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రూ.1,200 కోట్ల ఫీజ్ రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేసింది. ఈ మేరకు ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

News February 10, 2026

ఎల్లుండి నుంచి MLAలకు డిజిటల్ అటెండెన్స్!

image

AP: అసెంబ్లీకి కొందరు సభ్యులు గైర్హాజరు అవుతుండటంతో స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. రేపు సభ్యుల ఫింగర్ ప్రింట్స్ నమోదు చేసి.. ఎల్లుండి నుంచి డిజిటల్ విధానంలో హాజరు తీసుకోనున్నట్లు చెప్పారు. అలాగే MLA తనకు కేటాయించిన స్థానంలో కూర్చుంటేనే అటెండెన్స్ నమోదు చేస్తామని పేర్కొన్నారు. అటు రేపు జగన్‌తో పాటు వైసీపీ సభ్యులు అసెంబ్లీకి వెళ్తారని ఆ పార్టీ నేత బొత్స తెలిపారు.