News October 30, 2024
PBKS సంచలన నిర్ణయం: అర్ష్‌దీప్ రిలీజ్?

పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌ను రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. RTM ద్వారా మళ్లీ అతడిని దక్కించుకోవాలని ఆ జట్టు భావిస్తున్నట్లు సమాచారం. కాగా ఈ నిర్ణయంపై పంజాబ్ ఫ్యాన్స్ పెదవి విరుస్తున్నారు. ఇది ‘బిగ్గెస్ట్ బ్లండర్’ అని, ఒక్కసారి వేలంలోకి వెళ్లాక అర్ష్‌దీప్‌ను మళ్లీ దక్కించుకోవడం కష్టమని వారు అంటున్నారు. కాగా అర్ష్‌దీప్ ఐదేళ్లుగా పంజాబ్ తరఫున ఆడుతున్నారు.
Similar News
News February 8, 2026
‘లవ్ మ్యారేజ్ చేసుకున్న ప్రతి ఒక్కరికీ నా జీవితం గుణపాఠం’

AP: తిరుపతి(D) పుత్తూరులో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ప్రేమ వివాహం చేసుకున్న పద్మ అనే మహిళ ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్నారు. దీనికి భర్త నిరుద్యోగం, అప్పుల భారమే కారణంగా తెలుస్తోంది. ఆత్మహత్యకు ముందు రాసిన లేఖలో “తల్లిదండ్రులను ఎదిరించి పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరికీ నా జీవితం గుణపాఠం. లవ్ మ్యారేజీ చేసుకున్న పాపానికి ఎన్ని కష్టాలు పడ్డానో నాకు తెలుసు” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
News February 8, 2026
జెస్టేషనల్ డయాబెటీస్ వల్ల బిడ్డకు ఈ సమస్యలు

గర్భంలో ఉన్న శిశువుకి, తల్లి మాయ నుంచి గ్లూకోజ్ ఎక్కువగా అందుతుంటుంది. బిడ్డ పుట్టగానే తల్లి నుంచి వచ్చే చక్కెర అకస్మాత్తుగా ఆగిపోవడంతో బిడ్డలో చక్కెర మోతాదులు హఠాత్తుగా పడిపోయి చిన్నారి చల్లబడిపోవడం, ఊపిరితీసుకోవడంలో ఇబ్బందులు, ఫిట్స్ రావడం, సకాలంలో గమనించకపోతే బిడ్డ మృతిచెందే అవకాశాలుంటాయి. కార్డియోమయోపతి, స్థూలకాయం, టైప్–2 డయాబెటిస్, ఊపిరితిత్తుల సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
News February 8, 2026
NPCIL 30 పోస్టులకు నోటిఫికేషన్

న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (<


