News October 30, 2024
అన్నీ ఆడ నదులే.. ఆ రెండూ తప్ప!
గంగా, గోదావరి, యమున.. ఇలా మన దేశంలో అన్ని నదులకు స్త్రీ పేర్లే ఉంటాయి. కానీ సోన్, బ్రహ్మపుత్ర నదులు మాత్రం దీనికి మినహాయింపు. MPలో పుట్టిన సోన్, బిహార్‌లో గంగానదిలో కలుస్తుంది. బంగారు రంగులో కనిపిస్తుందని దాన్ని సోన్ అని పిలుస్తారు. ఇక హిమాలయాల నుంచి వచ్చే బ్రహ్మపుత్ర నదిని బ్రహ్మదేవుడి కొడుకుగా భావిస్తారు. ఈ నది టిబెట్, భారత్ మీదుగా బంగ్లాదేశ్ వెళ్లి అక్కడి నుంచి బంగాళాఖాతంలో కలుస్తుంది.
Similar News
News November 19, 2024
కృత్రిమ వర్షం కురిపించండి.. కేంద్రానికి మంత్రి రిక్వెస్ట్
ఢిల్లీలో తీవ్ర కాలుష్యం ఉందని, ఇందుకు కృత్రిమ వర్షమే ఏకైక పరిష్కారం అని ఆ రాష్ట్ర పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు. ప్రధాని మోదీ జోక్యం చేసుకుని కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కోరారు. కృత్రిమ వర్షంపై గత 3 నెలలుగా కేంద్రానికి లేఖలు రాస్తున్నా పట్టించుకోవడం లేదని వాపోయారు. దీనిపై కేంద్ర పర్యావరణశాఖ అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
News November 19, 2024
బుల్స్ బ్యాటింగ్: 1000 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. నిఫ్టీ 300, సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా ఎగిశాయి. దీంతో ఇన్వెస్టర్ల సంపద రూ.6లక్షల కోట్లమేర పెరిగింది. గ్లోబల్ మార్కెట్ల నుంచి పాజిటివ్ సిగ్నల్స్, డాలర్ దూకుడు తగ్గడం, FIIలు తిరిగొస్తుండటమే ఇందుకు కారణాలు. బ్యాంకింగ్, మీడియా, రియాల్టి, కన్జూమర్ డ్యురబుల్స్, O&G షేర్లకు డిమాండ్ పెరిగింది. 200DEMA లెవల్ నుంచి నిఫ్టీ బౌన్స్‌బ్యాక్ అయింది.
News November 19, 2024
తిరుమల వెళ్తున్నారా? ఇవి తెలుసుకోండి!
శ్రీవారి దర్శనానికి వెళ్లిన వారికి రూమ్స్ దొరక్కపోతే లాకర్స్ అందుబాటులో ఉంటాయి. వాటిలో వస్తువులను భద్రపరిచి సేదతీరేందుకు, కాలకృత్యాలు తీర్చుకునేందుకు ఉచిత మండపాలున్నాయి. తిరుమల బస్‌స్టాండుకు ఎదురుగా ఉన్న యాత్రి సదన్, యాత్రి సదన్-3 & పక్కనే ఉన్న పద్మనాభ నిలయం, ఇండియన్ పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న మాధవ నిలయంలో లాకర్స్ అందుబాటులో ఉంటాయి. వసతి కౌంటర్లు ఉదయం 4 నుంచి మధ్యాహ్నం 12 వరకు అందుబాటులో ఉంటాయి.