News October 30, 2024

తూ.గో జిల్లాలో బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు

image

తూ.గో జిల్లాలో సారా బట్టీలు, గంజాయి, బెల్ట్ షాపులు నిర్వహిస్తే కేసులో నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అక్రమ మద్యంపై దాడులు నిర్వహించి 47 మంది పై FIR నమోదు చేసినట్లు చెప్పారు. ఈ క్రమంలో సారా తయారీకి ఉపయోగించే 5,300 లీటర్ల బెల్లం ఊట, 6,500 కిలోల బెల్లాన్ని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

Similar News

News October 31, 2024

గుజరాత్‌లో ఇద్దరు తూ.గో. జిల్లా వాసులు మృతి

image

ఇద్దరు తూ.గో. జిల్లా యువకులు గుజరాత్‌లో చనిపోయారు. కొవ్వూరు(M) చెందిన టీడీపీ నేత హరిబాబు కుమారుడు రవితేజ, మరొక యువకుడు లోహిత్ గుజరాత్‌లో ఇంజినీరింగ్ చదువుతున్నారు. వారు అక్కడ పలు ప్రాంతాలను చూసేందుకు వెళ్లి ఓ జలాశయంలో మునిగి చనిపోయారు. కుమారుల మరణవార్త విని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వారి మృతదేహాలు కొవ్వూరుకు తీసుకురావడానికి చర్యలు తీసుకున్నట్లు MLA వెంకటేశ్వరరావు తెలిపారు.

News October 31, 2024

పిఠాపురం: ‘ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ సీఎం’

image

పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. జగతిని జాగృతం చేసే చైతన్య దీప్తుల శోభవాళి దీపావళి అని అభివర్ణించారు. దీపాల శోభతో దీపావళిని ఆనందంగా జరుపుకోవాలని సూచించారు. పండుగ వేళ అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కోరారు. అనాదిగా వస్తున్న ఈ దీపావళి పండుగ ప్రజలకు సకల శుభాలను ఆనందాన్ని కలుగజేయాలని ఆకాంక్షించారు. రాష్ట్రం దీపాల వలె వెలగాలని కోరారు.

News October 30, 2024

వైభవంగా గోదావరి పుష్కరాలు నిర్వహించాలి: MP

image

గోదావరి పుష్కరాలు-2027కి సంబంధించి కొవ్వూరులో ఉన్న గోదావరిని రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి స్థానిక ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావుతో కలిసి బుధవారం పరిశీలించారు. జరగబోయే గోదావరి పుష్కరాలు అత్యంత వైభవంగా నిర్వహించేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. భక్తులకు ఈ విధమైన ఇబ్బందులు కలగకుండా ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సుస్మిత రాణి ఇతర అధికారులు పాల్గొన్నారు.