News October 30, 2024

నిర్మాణాత్మక విమర్శలనే స్వీకరిస్తాం: విజయ్

image

రాజకీయాల్లో తమిళగ వెట్రి కళగం(TVK) కీలక పోషిస్తుందని ఆ పార్టీ చీఫ్, నటుడు విజయ్ వెల్లడించారు. తాము నిర్మాణాత్మక విమర్శలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో అనుకున్న లక్ష్యాలను సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల విశ్వాసం పొందేందుకు తీవ్రంగా కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ నెల 27న ఆయన నిర్వహించిన తొలి మహానాడు గ్రాండ్ సక్సెస్ అయిన విషయం తెలిసిందే.

Similar News

News September 17, 2025

ఆరోగ్యశ్రీ సేవలను కొనసాగించాలి: మంత్రి

image

TG: ఆరోగ్యశ్రీ సేవలను యథాతథంగా కొనసాగించాలని ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలను మంత్రి రాజనర్సింహ కోరారు. గత 9 ఏళ్లలో చేయని సమ్మె ఇప్పుడెందుకు చేయాల్సి వస్తోందని ప్రశ్నించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని, ప్రజలకు ఆరోగ్యశ్రీ సేవల్లో అంతరాయం ఉండదని స్పష్టం చేశారు. బకాయిలను చెల్లించాలనే డిమాండ్‌తో నెట్‌వర్క్ ఆస్పత్రులు ఇవాళ్టి నుంచి సేవలను <<17734028>>నిలిపివేసిన<<>> సంగతి తెలిసిందే.

News September 17, 2025

విశాఖలో గూగుల్ డేటా సెంటర్: సీఎం చంద్రబాబు

image

AP: విశాఖకు గూగుల్ డేటా సెంటర్ రాబోతోందని, త్వరలో దీనిపై ప్రకటన వస్తుందని సీఎం చంద్రబాబు తెలిపారు. విశాఖలో జరుగుతోన్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ బిజినెస్ సమ్మిట్‌లో ఆయన ప్రసంగించారు. ‘విశాఖలో అద్భుతమైన వాతావరణం ఉంది. శాంతిభద్రతలు పటిష్ఠంగా ఉన్నాయి. మహిళల భద్రతలో అగ్రస్థానంలో ఉంది’ అని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ భారత్‌కు అతిపెద్ద ఆస్తి అని కొనియాడారు. దేశానికి ఆయనే సరైన నాయకుడని పేర్కొన్నారు.

News September 17, 2025

EVMలపై అభ్యర్థుల కలర్ ఫొటోలు: EC

image

ఈవీఎంలపై భారత ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. పోలింగ్ సమయంలో మెషీన్లపై గుర్తులతో పాటు అభ్యర్థుల కలర్ ఫొటోలు ఉంచనున్నట్లు తెలిపింది. బిహార్ ఎన్నికల నుంచి ఈ నిబంధనలు అమలు చేయనున్నట్లు పేర్కొంది. దీంతో ఓటర్లు తమకు నచ్చిన అభ్యర్థులను మరింత సులభంగా ఎన్నుకోవచ్చు. ఈవీఎం ప్యానెల్‌లో క్రమసంఖ్య, అభ్యర్థి పేరు, కలర్ ఫొటో, గుర్తు వరుసగా ఉంటాయి. ఇప్పటివరకు అభ్యర్థుల పేర్లు, పక్కన వారి సింబల్స్ ఉండేవి.