News October 30, 2024

అత్యధిక మరణాల్ని కలిగిస్తున్న అంటువ్యాధి క్షయ: WHO

image

ప్రపంచంలో అత్యధిక మరణాలకు కారణమైన అంటువ్యాధుల్లో కొవిడ్-19 స్థానంలో క్షయ చేరిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) తెలిపింది. గత ఏడాది కొత్తగా 82 లక్షలమంది క్షయ బారిన పడ్డారని పేర్కొంది. ‘టీబీని సమూలంగా అంతం చేయడం అంత సులువు కాదు. ఏటా ఆ వ్యాధికి ఎంతోమంది పేద దేశాల ప్రజలు బలవుతున్నారు. దీనిపై అత్యవసరంగా దృష్టి పెట్టాలి’ అని WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనామ్ స్పష్టం చేశారు.

Similar News

News November 19, 2024

ఒత్తిడి, ఆందోళన తగ్గాలంటే ఇలా చేయండి!

image

అతిగా ఆలోచించి <<14648968>>చింతించడం<<>> కూడా ఓ ఆరోగ్య సమస్యేనని వైద్యులంటున్నారు. ఇది మిమ్మల్ని ప్రతికూల విషయాలపై దృష్టి సారించేలా చేస్తుంది. దీనిని అధిగమించాలంటే ఇష్టమైన ఆహారం తీసుకోవాలి. దీని వల్ల మెదడు చురుగ్గా మారుతుంది. ఒంటరిగా ఉండకుండా అందరితో కలిసి ఉండండి. రోజూ యోగా చేయండి. కంటినిండా నిద్రపోండి. వీలైనంత వరకూ మొబైల్‌కు దూరంగా ఉండండి. సక్సెస్ స్టోరీ బుక్స్ చదవండి. హ్యాపీగా ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయండి.

News November 19, 2024

‘కాళేశ్వరం’పై విచారణ.. ఈనెలాఖరున KCRకు పిలుపు!

image

TG: కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ చేపట్టేందుకు జస్టిస్ పీసీ ఘోష్ ఎల్లుండి HYD రానున్నారు. తొలుత ప్రాజెక్టు నిర్మాణ సమయంలో పనిచేసిన అధికారులు ఎస్కే జోషి, సోమేశ్‌కుమార్, రజత్‌కుమార్, స్మితా సబర్వాల్‌, రామకృష్ణారావును క్రాస్ ఎగ్జామిన్ చేయనున్నారు. ఆ తర్వాత ఈనెలాఖరున లేదా DEC తొలివారంలో KCR, హరీశ్ రావును విచారణకు పిలవనున్నట్లు సమాచారం. అయితే KCR విచారణకు వెళ్తారా? లేదా? అన్నది ఆసక్తిగా మారింది.

News November 19, 2024

భారత్ ఫైబర్ (BSNL)పై పెరుగుతోన్న ఆసక్తి!

image

BSNLలో 5G అందుబాటులోకి వస్తుండటంతో ప్రజలు ఈ నెట్‌వర్క్‌లోకి మారేందుకు మొగ్గుచూపుతున్నారు. దీంతో రోజురోజుకీ వినియోగదారుల సంఖ్య పెరిగిపోతోంది. అలాగే భారత్ ఫైబర్ (తక్కువ ధరకే WiFi)పైనా ఇంట్రెస్ట్ చూపుతున్నారు. దేశంలో మొత్తం 28.8 లక్షల కనెక్షన్లు ఉన్నాయి. కేరళ, తమిళనాడు‌లోనే దాదాపు 9లక్షల కనెక్షన్లు ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఇక APలో 1.7లక్షలు, TGలో 0.9లక్షల కనెక్షన్లున్నాయి.