News October 30, 2024
ప్రజాభవన్‌లో ప్రజావాణికి 588 దరఖాస్తులు

ప్రజాభవన్‌లో మంగళవారం నిర్వహించిన ప్రజావాణిలో మొత్తం 588 దరఖాస్తులు అందాయి. మైనారిటీ వెల్ఫేర్ శాఖకు సంబంధించి 221, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు 98, విద్యుత్ శాఖకు 84, రెవెన్యూ పరమైన సమస్యలపై 55, ప్రవాసీ ప్రజావాణి ద్వారా 4, ఇతర శాఖలకు 126 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ ఛైర్మన్ డా.చిన్నారెడ్డి, ప్రజాపాలన ప్రత్యేకఅధికారి దివ్య పాల్గొన్నారు.
Similar News
News January 17, 2026
లక్కీ డ్రా ఇన్‌ఫ్లుయెన్సర్ల పట్ల జాగ్రత్త: సీపీ సజ్జనార్

సోషల్ మీడియాలో కొంతమంది ఇన్‌ఫ్లుయెన్సర్లు కార్లు, బైకులు ఇస్తామంటూ లక్కీ డ్రాల పేరుతో మోసాలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని హైదరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ల దందా బంద్ కావడంతో లక్కీ డ్రాలు అంటూ కొత్త వేషాలతో వీళ్లు దర్శనమిస్తున్నారని ఫైరయ్యారు. అమాయకపు ప్రజల ఆశను ఆసరాగా చేసుకొని నిండా ముంచుతున్న ఇన్ఫ్లూయెన్సర్లపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.
News January 17, 2026
హైదరాబాద్ మెట్రో ఇక సర్కారు సొంతం!

HYD మెట్రోలో కొత్త అధ్యాయం మొదలైంది. L&T కున్న రూ.13,000 కోట్ల అప్పును ప్రభుత్వం స్వీకరిస్తూ, మరో ₹2,000 కోట్లను వాటా కింద చెల్లించి ప్రాజెక్టును పూర్తిగా స్వాధీనం చేసుకోనుంది. దీంతో మెట్రో నిర్వహణ, టికెట్ ధరలు, విస్తరణపై ప్రభుత్వానికి పూర్తి అధికారం దక్కనుంది. ఈ ప్రక్రియను మార్చి 2026 నాటికి పూర్తి చేసి మెట్రోను ప్రజలకు మరింత చేరువ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
News January 17, 2026
గచ్చిబౌలిలో రిజిస్ట్రేషన్ ఉంటేనే ఎంట్రీ!

గచ్చిబౌలి స్టేడియం వేదికగా నేడు పర్యాటక శాఖ నిర్వహించే ‘డ్రోన్ షో’కు సర్వం సిద్ధమైంది. ముందస్తుగా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికే ప్రవేశం ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటికే స్లాట్లన్నీ నిండిపోయినందున, రిజిస్ట్రేషన్ లేని వారు స్టేడియం వద్దకు రావొద్దని కోరారు. ఆ విన్యాసాలను మిస్ కాకుండా ఉండటానికి పర్యాటక శాఖ అందించే లైవ్ లింక్ ద్వారా వీక్షించాలని విజ్ఞప్తి చేశారు.


