News October 30, 2024

వారిని విధుల్లోకి తీసుకోండి: కూనంనేని

image

TG: ప్రభుత్వం విధుల నుంచి డిస్మిస్ చేసిన 10 మంది ప్రత్యేక పోలీసులు, సస్పెండ్ చేసిన 37 మందిని విధుల్లోని తీసుకోవాలని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విజ్ఞప్తి చేశారు. సమస్యలను వెల్లడించేందుకు వారు రోడ్డెక్కినట్లు పేర్కొన్నారు. వలసకాలపు ధోరణులను తొలగించి, సమస్యను పరిష్కరించాలన్నారు. అలా చేయకుండా వారిని అణచివేస్తే భవిష్యత్తులోనూ అసంతృప్తి కొనసాగే అవకాశముందన్నారు.

Similar News

News January 1, 2026

ఫ్రాన్స్‌లోనూ టీనేజర్లకు SM బ్యాన్?

image

15 ఏళ్ల లోపు పిల్లలకు SM వినియోగాన్ని నిషేధించాలని ఫ్రాన్స్ యోచిస్తోంది. ముసాయిదా చట్టాన్ని సిద్ధం చేయగా, సెప్టెంబర్ నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. చిన్న పిల్లలు చదువుతున్న స్కూళ్లలో ఫోన్ వాడటంపై ఇప్పటికే ఆంక్షలు విధించింది. త్వరలో ఉన్నత పాఠశాలల్లోనూ నిషేధించనుంది. 16 ఏళ్ల లోపు పిల్లలకు SM వినియోగాన్ని నిషేధించిన తొలిదేశంగా ఆస్ట్రేలియా నిలిచింది. తర్వాత మలేషియా కూడా ఇదే <<18381200>>నిర్ణయం<<>> తీసుకుంది.

News January 1, 2026

న్యూఇయర్ వేడుకల్లో డ్రగ్స్ కలకలం!

image

TG: న్యూఇయర్ వేడుకల్లో డ్రగ్స్ కలకలం రేపింది. హైదరాబాద్‌లోని ఇల్యూషన్ పబ్‌లో డీజే ఆర్టిస్ట్‌కు డ్రగ్ పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు అతడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నార్సింగిలో రాజేంద్రనగర్ SOT పోలీసులు దాడులు చేశారు. ఐదు గ్రాముల కొకైన్ సీజ్ చేశారు. మరోవైపు హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా ట్రాఫిక్ పోలీసులు పెద్ద ఎత్తున డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్నారు.

News January 1, 2026

అసభ్యంగా తాకేందుకు ప్రయత్నిస్తే బూటుతో కొట్టా: బ్రిటన్ రాణి

image

టీనేజీలో తనకు ఎదురైన అనుభవాన్ని బ్రిటన్ రాణి కెమిల్లా తాజాగా పంచుకున్నారు. ‘16-17 ఏళ్ల వయసులో నేను లండన్‌లో రైలులో వెళ్తుండగా ఓ వ్యక్తి అసభ్యంగా తాకేందుకు ప్రయత్నించాడు. అతడిని అడ్డుకోవడంతో నాపై దాడి చేశాడు. నేను బూటు తీసి కొట్టాను. మహిళలపై జరుగుతున్న హింస ఎంత పెద్ద సమస్యో తెలియజేసేందుకే ఇప్పుడు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నా’ అని ఓ రేడియో ఇంటర్వ్యూలో కెమిల్లా తెలిపారు.