News October 30, 2024

అనంతపురంలో కిలో టమాటా రూ.28

image

అనంతపురం రూరల్‌ స్థానిక కక్కలపల్లి మార్కెట్‌లో కిలో టమాటా గరిష్ఠంగా రూ.28తో అమ్ముడు పోయినట్లు రాప్తాడు మార్కెట్ యార్డు కార్యదర్శి రాంప్రసాద్‌ తెలిపారు. మార్కెట్‌కు మంగళవారం మొత్తంగా 975 టన్నుల దిగుబడులు వచ్చాయని ఆయన అన్నారు. కిలో సరాసరి ధర రూ.20, కనిష్ఠ ధర రూ.13 పలికినట్లు తెలిపారు. మార్కెట్లో టమాటా ధరలు క్రమేణా తగ్గుతుండటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News December 26, 2025

అనంతపురం: మహిళలకు అండగా ‘సఖి’ వాహనం

image

సమాజంలో హింసకు గురయ్యే మహిళలు సఖి వన్ స్టాప్ సెంటర్‌ను ఆశ్రయించవచ్చని కలెక్టర్ ఆనంద్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో సఖి వాహనాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఆపదలో ఉన్న మహిళలకు అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసిందని, బాధితులకు అవసరమైన రక్షణ, సాయం ఇక్కడ అందుతాయని కలెక్టర్ పేర్కొన్నారు.

News December 25, 2025

శిల్పారామంలో జనవరి 1న సాంస్కృతిక కార్యక్రమాలు

image

అనంతపురం శిల్పారామంలో నూతన సంవత్సరం సందర్భంగా 2026 జనవరి 1న సాయంత్రం 5గంటల నుంచి 8 వరకు ప్రముఖ కళాకారులచే ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు గురువారం పరిపాలన అధికారి పి.శివ ప్రసాద్ రెడ్డి గురువారం వివరాలు వెల్లడించారు. సంస్కృతీ సంప్రదాయాల సమాహారం శిల్పారామం అన్నారు. అనంత ప్రజల కోసం నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహిస్తామన్నారు.

News December 25, 2025

తాడిపత్రి: రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య

image

తాడిపత్రి మండలంలో రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన గురువారం చోటుచేసుకుంది. మండల పరిధిలోని చల్లవారిపల్లె సమీపంలో రైల్వే పట్టాలపై మృతదేహం ఉన్నట్లు స్థానికులు గుర్తించి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఆరా తీస్తున్నారు.