News October 30, 2024

నవాబ్ మాలిక్‌కు మద్దతివ్వం: బీజేపీ

image

దావూద్ ఇబ్రహీంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు ఎదుర్కొంటున్న నేత నవాబ్ మాలిక్ NCP(అజిత్ పవార్) తరఫున నామినేషన్ దాఖలు చేశారు. అయితే మాలిక్‌కు తాము మద్దతు ఇవ్వట్లేదని BJP నేతలు తెలిపారు. దావూద్‌తో సంబంధాలు ఉన్నవారికి మద్దతు ఇవ్వబోమని స్పష్టం చేశారు. కూటమి పార్టీలు తమకు నచ్చిన నేతను ఎంపిక చేసుకునే అవకాశం ఉందన్నారు. సిట్టింగ్ స్థానాన్ని వదిలేసిన మాలిక్ మన్ఖుర్డ్-శివాజీ నగర్ నుంచి బరిలో ఉన్నారు.

Similar News

News February 6, 2026

జూన్ 1న ఈఏపీసెట్ ఫలితాలు!

image

AP: ఈఏపీసెట్‌కు మార్చి 7 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఉన్నత విద్యామండలి వెల్లడించింది. మే 12 నుంచి 20 వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపింది. 23న ప్రాథమిక కీ, జూన్ 1న ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉందని పేర్కొంది. ‘ఈసెట్‌కు మార్చి 2 వరకు అప్లై చేసుకోవచ్చు. ఏప్రిల్ 23న పరీక్ష, మే 7న రిజల్ట్స్ రిలీజ్ చేస్తాం. ఐసెట్‌కు మార్చి 2 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మే 2న పరీక్ష, 16 ఫలితాలు ప్రకటిస్తాం’ అని పేర్కొంది.

News February 6, 2026

యాసంగి వేరుశనగ సాగు – నీటి యాజమాన్యం

image

వేరుశనగను విత్తే ముందు నేల తడిచేలా నీరు పెట్టి తగినంత పదును ఉన్నప్పుడు విత్తనం వేసుకోవాలి. మొదటి తడిని మొలక వచ్చిన 20-25 రోజులకు ఇవ్వాలి. దీని వల్ల పైరు ఒకేసారి పూతకు వచ్చి, ఊడలు కూడా సరిగా ఏర్పడి దిగుబడి బాగుంటుంది. తర్వాత నేల లక్షణం, బంక మట్టి శాతాన్ని బట్టి 7-10 రోజులకు ఒక నీటి తడినివ్వాలి. చివరి తడిని పంట కోతకు 4-7 రోజుల మధ్య అందించాలి. దీని వల్ల మొక్కలు పీకడం సులభం. గింజలు నేలలో ఉండిపోవు.

News February 6, 2026

ఆయిల్ ఇండియా లిమిటెడ్‌ 29 పోస్టులకు నోటిఫికేషన్

image

<>ఆయిల్<<>> ఇండియా లిమిటెడ్‌ 29 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గలవారు మార్చి 7 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, PG, B.Ed, BLSc, డిప్లొమా అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. మార్చి 29న రాత పరీక్ష(CBT)నిర్వహించి ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.200, SC, ST, EWS, PwBDలకు ఫీజు లేదు. వెబ్‌సైట్: https://www.oil-india.com