News October 30, 2024

రాష్ట్రంలో 16,347 ఉద్యోగాలు.. 6న నోటిఫికేషన్!

image

AP: రాష్ట్రంలో 16,347 పోస్టులతో నవంబర్ 6న మెగా DSC నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 3-4 నెలల్లో నియామక ప్రక్రియ పూర్తిచేసి, వచ్చే విద్యాసంవత్సరానికి పోస్టింగులు ఇచ్చేలా ప్రణాళిక సిద్ధం చేసింది. ఇప్పటికే జిల్లాల వారీగా ఖాళీలు, రోస్టర్ పాయింట్లు, సమాంతర రిజర్వేషన్ల వివరాలను DEOల నుంచి సేకరించింది. మరోవైపు టెట్ తుది కీ నిన్న విడుదల కాగా, 2న ఫలితాలు వెల్లడికానున్నాయి.

Similar News

News November 19, 2024

పవన్ కళ్యాణ్‌పై క్రిమినల్ కేసు కొట్టివేత

image

AP: dy.CM పవన్ కళ్యాణ్‌పై నమోదైన క్రిమినల్ కేసును కొట్టివేస్తూ గుంటూరు జిల్లా కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసుతో సంబంధం ఉన్న వాలంటీర్లను కోర్టు విచారించగా.. తమకు సంబంధం లేదని వారు కోర్టుకు తెలిపారు. దీంతో కోర్టు కేసును తొలగించింది. కొంత మంది వాలంటీర్లు సంఘ విద్రోహ శక్తులుగా మారారని గతేడాది పవన్ వ్యాఖ్యానించారు. దీనిపై కొందరు ప్రభుత్వానికి ఫిర్యాదు చేయగా గుంటూరు జిల్లా కోర్టులో కేసు నమోదైంది.

News November 19, 2024

విజయ డెయిరీ పాల సేకరణ ధర పెంపు

image

AP: పాల సేకరణ ధరను పెంచాలని కృష్ణా మిల్క్ యూనియన్ (విజయ డెయిరీ) నిర్ణయించింది. 10% వెన్న కలిగిన లీటర్ గేదె పాలపై రూ.2, ఆవు పాలపై రూ.1.50 పెంచుతున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం 10% వెన్న కలిగిన పాలకు రూ.80 చెల్లిస్తుండగా, రూ.2 పెంచడంతో రూ.82కి చేరింది. యూనియన్‌లో ఉన్న పాడి రైతులకు 4 నెలలకు సంబంధించిన రెండో విడత బోనస్‌గా రూ.12కోట్లను నేడు విడుదల చేయనుంది.

News November 19, 2024

ఛాంపియన్స్ ట్రోఫీ పాక్‌లోనే జరిగి తీరుతుంది: పీసీబీ

image

ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్థాన్‌లోనే జరుగుతుందని పీసీబీ ఛైర్మన్ మొహిసిన్ నఖ్వీ స్పష్టం చేశారు. హైబ్రిడ్ మోడల్‌కు అంగీకరించే ప్రసక్తే లేదని చెప్పారు. ‘అసలు తమ దేశానికి భారత్ ఎందుకు రాదో లిఖితపూర్వకంగా సమాధానమివ్వాలి. పాక్‌లో పర్యటించడానికి భారత్‌కు ఏంటీ సమస్య? ఇకపై బీసీసీఐ ఒత్తిడికి తలొగ్గం. ఐసీసీ వెంటనే షెడ్యూల్ విడుదల చేయాలి’ అని ఆయన డిమాండ్ చేశారు.