News October 30, 2024
కడప: రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య

కడప-కృష్ణాపురం రైలు మార్గంలోని ఎగువ రైలు పట్టాలపై షేక్ అన్వర్ బాషా (62) ఆత్మహత్య చేసుకున్నట్లు కడప రైల్వే హెడ్ కానిస్టేబుల్ గోపాల్ తెలిపారు. రామాపురం మండలం హసనాపురం గ్రామానికి చెందిన అన్వర్ బాషా అప్పుల బాధతో మంగళవారం మధ్యాహ్నం ముంబయి-చెన్నై రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. మృతదేహాన్ని రిమ్స్ మార్చురీకి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని హెడ్ కానిస్టేబుల్ వివరించారు.
Similar News
News January 13, 2026
ప్రొద్దుటూరు నూతన DSPగా విభూ కృష్ణ

కడప జిల్లా ప్రొద్దుటూరు DSP భావనను అధికారులు బదిలీ చేశారు. ఆయన స్థానంలో 2021 బ్యాచ్ ఐపీఎస్ అధికారి విభూ కృష్ణను నియమిస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేశారు. డీఎస్పీ ఇతర పోలీసు అధికారులపై ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి బహిరంగంగా పలు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈక్రమంలోనే బదిలీ చేశారని తెలుస్తోంది. విభూ కృష్ణ ప్రస్తుతం గ్రేహౌండ్స్ అసాల్ట్ కమాండర్‌గా ఉన్నారు. త్వరలో DSP బాధ్యతలు స్వీకరించనున్నారు.
News January 13, 2026
కడప: మద్యం బాటిల్‌పై రూ.10 పెంపు!

కడప జిల్లాలో గతనెల 1,43,405 కేసుల లిక్కర్ (IML), 54,938 కేసుల బీరు తాగేశారు. డిసెంబర్‌లో మద్యం అమ్మకాలతో ప్రభుత్వానికి రూ.98.98 కోట్లు ఆదాయం వచ్చింది. న్యూ ఇయర్ సంబరాల్లో ఒక్కరోజులోనే జిల్లాలో 9,658 కేసులు లిక్కర్, 3,991 కేసులు బీరు తాగారు. ఆ ఒక్క రోజులోనే రూ.7.23 కోట్ల ఆదాయం లభించింది. APలో రూ.99ల మద్యం, బీరు మినహా అన్ని బాటిళ్లపై రూ.10లు పెంచుతూ సోమవారం GO విడుదలైన విషయం తెలిసిందే.
News January 13, 2026
కడప జిల్లాలో పోస్టింగ్.. భర్త SP.. భార్య JC.!

కడప JCగా నూతనంగా నిధి మీనా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈమె ప్రస్తుతం కడప జిల్లా ఎస్పీగా పనిచేస్తున్న షెల్కే నచికేత్ విశ్వనాథ్ సతీమణి. ఈమెది 2019 ఐఏఎస్ బ్యాచ్. మొదటగా తెనాలి సబ్ కలెక్టర్‌గా పనిచేశారు. ఆ తర్వాత వయోజన విద్య డైరెక్టర్‌గా, ఎన్టీఆర్ JCగా విధులు నిర్వహించారు. ఇప్పటివరకు కడప JCగా పనిచేసిన అదితిసింగ్ ప్రసూతి సెలవులో ఉన్నారు.


