News October 30, 2024
ఉచిత ఇసుకపై YCP పోస్ట్.. స్పందించిన మంత్రి కొలుసు

నూజివీడులో కూటమి ప్రభుత్వం బరితెగించిందని YCP పెట్టిన పోస్టుపై మంత్రి కొలుసు పార్థసారథి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ‘అబద్ధాలను ప్రచారం చేయడంలో YCP దిట్ట అని చెప్పవచ్చన్నారు. ఎవరో తెలియక తమ వ్యాపారం కోసం పెట్టుకున్న బోర్డులను TDP, రాష్ర్ట ప్రభుత్వానికి ఆపాదించడం ఎంత వరకు సమంజసమన్నారు. YCP హయాంలో ఇసుక దొరక్క ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డ సంగతి మరిచిపోయారా’ అని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.
Similar News
News January 12, 2026
కృష్ణా: రికార్డు స్థాయి పందేం ఇదే.. అందరి నోట ఒక్కటే మాట!

కోడి పందేల చరిత్రలో రికార్డు స్థాయి పందేలు సంచలనం సృష్టిస్తున్నాయి. గతంలో సీసలి బరిలో జరిగిన రూ. 25 లక్షల పందెం ఒక ఎత్తైతే, తాడేపల్లిగూడెంలో ఏకంగా రూ. 1.25 కోట్ల పందేం జరగడం పందెం రాయుళ్లను విస్మయానికి గురిచేసింది. కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన ప్రభాకర్ ఈ భారీ పందేంలో నెగ్గి చరిత్ర సృష్టించారు. దీంతో ఈ ప్రాంతంలో పందేలకు క్రేజ్ అమాంతం పెరిగింది.
News January 12, 2026
మచిలీపట్నంలో మీకోసం కార్యక్రమం: కలెక్టర్

ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం మచిలీపట్నంలోని కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మేరకు కలెక్టర్ డి.కె. బాలాజీ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యక్రమంలో పాల్గొని సంబంధిత అధికారులకు అర్జీలు అందించి, పరిష్కారం పొందాలని ఆయన సూచించారు.