News October 30, 2024
క్రేజీ న్యూస్ చెప్పిన తమన్

మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అదిరిపోయే న్యూస్ చెప్పారు. NBK109, గేమ్ ఛేంజర్ నుంచి అప్డేట్లు రానున్నట్లు ట్వీట్ చేశారు. దీంతో వెయిటింగ్ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. కాగా NBK109 బాలకృష్ణ, బాబీ కాంబినేషన్లో తెరకెక్కుతోంది. ‘గేమ్ ఛేంజర్’ మూవీ రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్లో వస్తోంది. ఈ రెండు చిత్రాలకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
Similar News
News February 18, 2026
కొచ్చిన్ యూనివర్సిటీలో టెక్నికల్ పోస్టులు

<
News February 18, 2026
ఎందుకలా: ఉప్పగానే సముద్రపు నీరు..

వర్షం పడినప్పుడు నీరు గాలిలోని CO₂తో కలిసి ఆమ్లంగా మారుతుంది. ఆ తర్వాత నదుల్లోకి చేరి రాళ్లు, మట్టిని కరిగిస్తూ సోడియం, క్లోరైడ్ వంటి లవణాలను సముద్రంలో చేరుస్తుంది. ఆపై సూర్యుడి వేడితో నీరు ఆవిరైనప్పుడు లవణాలు సముద్రంలో మిగిలిపోతాయి. ఇలా కోట్లాది ఏళ్లుగా జరుగుతూ సముద్ర నీటి సగటు లవణీయత 3.5%కి చేరింది. ఇందులో 85% Nacl ఉంటుంది. సముద్ర గర్భంలో ఉండే హైడ్రోథర్మల్ వెంట్స్ కూడా లవణాల వృద్ధికి సాయపడతాయి.
News February 18, 2026
కరవు నుంచి జలసిరి.. అభినందించాల్సిందే!

మహారాష్ట్రలోని బన్సావర్గావ్ గ్రామస్థులు ఐకమత్యంతో కరవును జయించి ఆదర్శంగా నిలిచారు. ఒకప్పుడు 700 అడుగుల లోతున బోర్లు వేసినా చుక్క నీరు దొరకని స్థితి నుంచి నేడు ట్యాంకర్ రహిత గ్రామంగా తీర్చిదిద్దారు. ప్రజలంతా కలిసి ఐకమత్యంతో కాలువలు తవ్వడం, చెక్ డ్యామ్‌ల నిర్మాణం, బిందు సేద్యం చేపట్టడంతో భూగర్భ జలాలు పెరిగాయి. సంకల్పం ఉంటే ప్రకృతిని సైతం అనుకూలంగా మార్చుకోవచ్చని ఈ గ్రామం నిరూపించింది.


