News October 30, 2024
ఏప్రిల్‌లోనే ఎప్‌సెట్!

TG: ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీలో ప్రవేశాలకు పరీక్షలకు నిర్వహించే ఎప్‌సెట్ పరీక్షను వచ్చే ఏప్రిల్‌లో నిర్వహించాలని ఉన్నత విద్యామండలి భావిస్తున్నట్లు సమాచారం. ఏటా మేలో పరీక్ష నిర్వహిస్తుండగా క్లాసులు మొదలవడానికి SEP వరకు సమయం పడుతోంది. దీంతో APRలో ఇంటర్ ఎగ్జామ్స్ ముగిశాక ఎప్‌సెట్ నిర్వహించి జులైలో క్లాసులు మొదలయ్యేలా ప్లాన్ చేస్తోంది. ఇతర ప్రవేశ పరీక్షల షెడ్యూల్స్‌పై సైతం కసరత్తు చేస్తోంది.
Similar News
News February 19, 2026
చరిత్ర సృష్టించిన హర్మన్

భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ చరిత్ర సృష్టించారు. అత్యధిక(356) అంతర్జాతీయ మ్యాచ్‌లు(టెస్టు, ODI, T20) ఆడిన ప్లేయర్‌గా నిలిచారు. ఇవాళ ఆసీస్‌తో రెండో టీ20 ఆడటం ద్వారా ఈ ఘనత సాధించారు. తర్వాతి స్థానాల్లో సుజీ బేట్స్(కివీస్-355M), ఎల్లీస్ పెర్రీ(ఆసీస్- 349M), మిథాలీ రాజ్(ఇండియా-333M) ఉన్నారు. కాగా ఇవాళ్టి మ్యాచ్‌లో భారత్‌పై 19 పరుగుల తేడాతో ఆసీస్ గెలిచింది.
News February 19, 2026
శివుడు విషం తాగిన శంఖం ఉంది ఇక్కడే..

మంధర పర్వతాన్ని చిలుకుతుండగా ఉద్భవించిన విషాన్ని శంఖంతో తాగి పరమశివుడు సమస్త లోకాన్ని రక్షించాడు. అయితే ఆ పర్వతం నేటి బీహార్‌లోని బాంకా జిల్లాలో ఉందని నమ్మకం. అలాగే ఇక్కడి ‘శంఖగుండం’ అనే నీటి మడుగులో ఆ దివ్య శంఖం ఉంటుందని చెబుతారు. ఏడాది పొడవునా 80 అడుగుల నీటితో నిండి ఉండే ఈ గుండం, కేవలం మహాశివరాత్రి పర్వదినాన మాత్రమే పూర్తిగా ఎండిపోయి, అడుగున ఉన్న శంఖం భక్తులకు దర్శనమిస్తుంది.
News February 19, 2026
EC ఫారం కోళ్లలో గురక వ్యాధిని నివారించాలంటే?

EC (ఎన్విరాన్‌మెంటల్ కంట్రోల్) ఫారంలో కోళ్లకు ఎక్కువగా CRD (గురక వ్యాధి) వస్తుంటుంది. దీనికి కారణం ఫారం లోపల అమ్మోనియా వాయువు ఎక్కువగా విడుదలవ్వడం. ఇలా రిలీజైన అమ్మోనియా వాయువును కోళ్లు ఎక్కువగా పీల్చడం వల్ల వాటికి ఈ గురక వ్యాధి వస్తుంది. దీని పరిష్కారంగా EC షెడ్‌కు రెండు వైపులా వాయువులను బయటకు పంపే ఫ్యాన్లను మాన్యువల్ పద్ధతిలో నడిపించాలి. దీని వల్ల అమ్మోనియా బయటకు పోయి కోళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.


