News October 30, 2024
నూతన ఏపీ భవన్ నిర్మాణానికి టెండర్లు
ఢిల్లీలో నూతన ఏపీ భవన్‌ను నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రీ డెవలప్మెంట్ ఆఫ్ ఏపీ భవన్ పేరుతో డిజైన్లకు టెండర్లను పిలిచింది. 11.53 ఎకరాల్లో నిర్మాణం చేపట్టనుంది. ప్రస్తుతం ఉన్న భవనాలను రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి వినియోగించుకుంటున్నాయి. అయితే ఎన్నికలకు ముందు ఇరు రాష్ట్రాల అధికారులు భవన్ విభజనను ఖరారు చేసుకుని ప్రతిపాదనలు పంపగా కేంద్ర హోం శాఖ ఆమోదం తెలిపింది.
Similar News
News October 30, 2024
మద్యంపై ఖర్చు చేయడంలో తెలంగాణ NO.1
మద్యం అమ్మకాల్లో తెలంగాణ దూసుకెళ్తోంది. భారత్‌లో సగటున ఓ వ్యక్తి మద్యం కోసం చేసిన ఖర్చులో తెలంగాణ నంబర్ వన్‌గా నిలిచింది. 2022-23లో రాష్ట్రంలో యావరేజ్‌గా ఓ వ్యక్తి రూ.1623 ఖర్చు చేసినట్లు నివేదికలో వెల్లడైంది. AP సగటున రూ.1306 ఖర్చుతో రెండో స్థానంలో ఉంది. తర్వాత పంజాబ్ (రూ.1245), ఛత్తీస్‌గఢ్(రూ.1227) ఉన్నాయి. కింగ్‌ఫిషర్, మెక్‌డొవెల్స్, టుబర్గ్లు పాపులర్ బ్రాండ్స్‌గా నిలిచాయి.
News October 30, 2024
ICC ర్యాంకింగ్స్: బుమ్రా కిందకి.. జైస్వాల్ పైకి
తాజాగా ఐసీసీ విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత పేసర్ బుమ్రా 3వ స్థానానికి పడిపోయారు. అశ్విన్ 4, జడేజా 8వ స్థానంలో ఉన్నారు. ఈ విభాగంలో సౌతాఫ్రికా బౌలర్ కగిసో రబాడ అగ్రస్థానానికి చేరుకున్నారు. బ్యాటింగ్ విభాగంలో భారత యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ 3వ స్థానానికి ఎగబాకారు. టాప్-10లో భారత్ నుంచి అతనొక్కడే ఉన్నారు. ఈ విభాగంలో టాప్‌లో ఇంగ్లండ్ బ్యాటర్ రూట్ ఉన్నారు.
News October 30, 2024
రైతు సమస్యలపై జగన్ మొసలి కన్నీరు: MLA జీవీ
AP: రైతుల గురించి మాట్లాడే నైతిక అర్హత జగన్‌కు లేదని టీడీపీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు విమర్శించారు. ఉచిత పంటల బీమా పేరిట రైతులను జగన్ ముంచారని దుయ్యబట్టారు. రైతు సమస్యలపై ఆయన మొసలి కన్నీరు మానుకోవాలని చురకలంటించారు. బీమా సంస్థలకు రూ.1300 కోట్లకు పైగా బకాయిలు పెట్టి, వాటిని మేం కట్టాలనడం శోచనీయమని అన్నారు. సాగును అస్తవ్యస్తం చేసిన జగన్ రైతులను ఆత్మహత్య ఊబిలోకి నెట్టారని ఫైర్ అయ్యారు.