News October 30, 2024

పేలిన ‘లోకల్’ బాంబు: చైనాకు రూ.లక్ష కోట్ల నష్టం!

image

భారత ‘వోకల్ ఫర్ లోకల్’ నినాదం చైనాకు భారీ షాకే ఇచ్చింది. ఈ దీపావళి సీజన్లో ఆ దేశం రూ.1.25 లక్షల కోట్ల మేర వ్యాపారం నష్టపోతుందని CAIT సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్‌వాల్ తెలిపారు. కస్టమర్లు ఎక్కువగా స్థానిక ఉత్పత్తులనే కొంటున్నారని చెప్పారు. భారత వ్యాపారం ఈ 5 రోజుల్లోనే రూ.4.25 లక్షల కోట్ల టర్నోవర్‌ను టచ్ చేయొచ్చని అంచనా వేశారు. ధంతేరాస్ రోజే రూ.60వేల కోట్ల టర్నోవర్ దాటొచ్చని వెల్లడించారు.

Similar News

News November 18, 2024

గుడ్‌న్యూస్: టెన్త్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు

image

AP: టెన్త్ పబ్లిక్ పరీక్షలకు ఫీజు చెల్లింపు తేదీని విద్యాశాఖ మరోసారి <>పొడిగించింది.<<>> ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఈ నెల 26 వరకు చెల్లించవచ్చు. రూ.50 ఫైన్‌తో DEC 2 వరకు, రూ.200 జరిమానాతో DEC 9 వరకు, రూ.500 అదనపు రుసుముతో DEC 16 వరకు అవకాశం ఉంది. రెగ్యులర్ విద్యార్థులు అన్ని సబ్జెక్టులకు రూ.125, 3 సబ్జెక్టుల లోపు రూ.110, ఒకేషనల్ స్టూడెంట్స్ రూ.60 అదనంగా చెల్లించాలి.

News November 18, 2024

అరెస్టులకు భయపడేవారు లేరిక్కడ: KTR

image

TG: రాష్ట్రంలో ప్రశ్నిస్తే సంకెళ్లు, నిల‌దీస్తే అరెస్టులు చేస్తున్నారని రేవంత్ ప్రభుత్వంపై KTR మండిపడ్డారు. ‘నియంత రాజ్యమిది, నిజాం రాజ్యాంగ‌మిది. కాంగ్రెస్ వైఫల్యాలను ఎత్తి చూపినందుకే కొణతం దిలీప్‌ను అరెస్ట్ చేశారు. విచారణకు రమ్మని పిలిచి అక్రమంగా అరెస్ట్ చేస్తారా? ఎన్నాళ్లు ఈ అక్రమ అరెస్టులతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తావు. నీ అక్రమ అరెస్టులకు భయపడేవాడు ఎవరూ లేరిక్కడ’ అని KTR ట్వీట్ చేశారు.

News November 18, 2024

DSC నోటిఫికేషన్ మరింత ఆలస్యం?

image

AP: షెడ్యూల్ ప్రకారం DSC నోటిఫికేషన్ ఈనెల 6న విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడింది. ఎస్సీ వర్గీకరణ కోసం ప్రభుత్వం నోటిఫికేషన్‌ను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. వర్గీకరణ ఎలా చేయాలన్న దానిపై ఏకసభ్య కమిషన్ నివేదిక ఇచ్చిన తర్వాత, 2, 3 నెలల్లో నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి టీచర్ల భర్తీ ప్రక్రియను పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.