News October 30, 2024
చైనా అగ్ర కుబేరుడు.. అంబానీ, అదానీకంటే పేదోడు!
హురున్ చైనా రిచ్ తాజాగా ప్రకటించిన చైనా కుబేరుల జాబితాలో టిక్‌టాక్ మాతృసంస్థ బైట్ డాన్స్ వ్యవస్థాపకుడు ఝాంగ్ ఇమింగ్ అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. ఆయన ఆస్తి విలువ 49.3 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు ఆ సంస్థ తెలిపింది. అయితే, అది భారత కుబేరులు అంబానీ, అదానీల కంటే తక్కువే కావడం గమనార్హం. రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ సంపద విలువ 102 బిలియన్ డాలర్లు కాగా అదానీ ఆస్తి 92.4 బిలియన్ డాలర్లుగా ఉంది.
Similar News
News November 18, 2024
పాక్ ODI టీమ్ హెడ్‌కోచ్‌గా అకీబ్
పాకిస్థాన్ వన్డే జట్టుకు నెలలోనే మూడో హెడ్ కోచ్ వచ్చారు. ఆ స్థానంలో మాజీ ఆల్‌రౌండర్ అకీబ్ జావేద్‌ను నియమించినట్లు PCB ప్రకటించింది. మేనేజ్‌మెంట్, ఆటగాళ్లతో విభేదాలతో గత నెల 28న ODI జట్టు కోచ్ పదవికి గ్యారీ కిర్‌స్టెన్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో తాత్కాలిక కోచ్‌గా గిలెస్పీని ఎంపిక చేసింది. ఇప్పుడు ఆయననూ తప్పించి అకీబ్‌కు ఛాన్స్ ఇచ్చింది. ఈయన పాక్ తరఫున 163 ODIలు, 22 టెస్టులు ఆడారు.
News November 18, 2024
అర్హత ఉన్న ప్రతి కుటుంబానికీ ‘ఉచిత గ్యాస్’: నాదెండ్ల
AP: బడ్జెట్‌లో దీపం-2 పథకానికి పూర్తిస్థాయిలో నిధులు ఎందుకు కేటాయించలేదని మండలిలో ప్రతిపక్ష నేత బొత్స ప్రశ్నించారు. దీనికి మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందిస్తూ ‘రాష్ట్రంలో 1.55 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికీ ఉచిత గ్యాస్ సిలిండర్ అందజేస్తాం. ఇప్పటికే 30 లక్షల మందికి డెలివరీ చేశాం. ఈ కార్యక్రమం పూర్తిపారదర్శకంగా జరుగుతోంది. దీనికి పూర్తి నిధులు కేటాయించాం’ అని చెప్పారు.
News November 18, 2024
‘40% కమీషన్’ ఆరోపణలు: BJPకి లోకాయుక్తలో రిలీఫ్
కర్ణాటకలో గత BJP సర్కారు కాంట్రాక్టులు కట్టబెట్టేందుకు 40% కమీషన్లు తీసుకున్నట్టు ఆధారాలేమీ లేవని లోకాయుక్త వెల్లడించింది. BBMPలో కాంట్రాక్టులు పొందేందుకు కమీషన్లు ఇవ్వాల్సి వస్తోందని టీవీల్లో పేర్కొన్న అంబికాపతికి ఐదేళ్లపాటు 2022 వరకు అసలు కాంట్రాక్టులే రాలేదంది. 2023, NOV 27న ఆయన చనిపోయారని, ఆయన కొడుకూ ఎలాంటి ఆధారాలు ఇవ్వలేదని స్పష్టం చేసింది. దీంతో కాంగ్రెస్‌పై BJP విమర్శలకు దిగింది.