News October 30, 2024
టపాసులు కాల్చేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి: మంత్రి పొన్నం
దీపావళి ఒక పెద్ద వేడుక అని, ఈ పండగ సందర్భంగా జరిగే అగ్ని ప్రమాదాలు నివారించడానికి టపాసులు కాల్చేటప్పుడు ప్రతి ఒక్కరు జాగ్రత్తగా వ్యవహరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఎక్కడైన నివాస సముదాయాల్లో టపాసులు అమ్ముతుంటే సంబంధిత అధికారికి ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రమాదాలు నివారించడానికి అందరు సామాజిక బాధ్యతగా వ్యవహరించాలని తెలిపారు.
Similar News
News October 31, 2024
జిన్నారం: నవంబర్ 2న ఉమ్మడి జిల్లా క్రికెట్ ఎంపికలు
స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నవంబర్ 2న ఉమ్మడి జిల్లా క్రికెట్ ఎంపికలు నిర్వహించనున్నట్లు ఆర్గనైజింగ్ సెక్రటరీ అమూల్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిన్నారం టీటీడబ్ల్ఆర్ఎస్ పాఠశాలలో అండర్ 17 బాలుల క్రికెట్ ఎంపికలు ఉంటాయని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు ఉ.9 గంటలకు హాజరు కావాలని సూచించారు. ఇతర వివరాలకు 6281440401,9505796688 నంబర్లను సంప్రదించాలని కోరారు.
News October 31, 2024
దీపావళి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్
తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. మనిషి తనలోని మూర్ఖత్వాన్ని, అజ్ఞానాన్ని తొలగించుకుని జ్ఞాన దీపాలను వెలిగించుకోవాలనే తాత్వికతను దీపావళి పండుగ మనకు అందిస్తుందని కేసీఆర్ తెలిపారు. దీపావళి పర్వదినానికి హిందూ సంస్కృతిలో ప్రత్యేక స్థానం ఉన్నదన్నారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని దీపావళి సందర్భంగా కేసీఆర్ ప్రార్థించారు.
News October 30, 2024
సంగారెడ్డి: టెన్త్ ప్రత్యేక తరగతుల సమయంలో మార్పులు
పదో తరగతి ప్రత్యేక తరగతుల సమయంలో మార్పులు చేస్తూ సంగారెడ్డి జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.ఈ సందర్భంగా డిఈఓ మాట్లాడుతూ.. సాయంత్రం 4.15 నుంచి 5.15 గంటల వరకు అన్ని ప్రభుత్వ, కేజీబీవీ పాఠశాలలు పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని పేర్కొన్నారు.