News October 30, 2024
డాన్ కావాలన్నదే డ్రీమ్: సల్మాన్ ‘డెత్ థ్రెట్’ నిందితుడి బ్యాగ్రౌండ్ ఇదే
యాక్టర్ సల్మాన్, MLA జీషన్ సిద్దిఖీని బెదిరించిన మహ్మద్ తయ్యబ్ (20) నోయిడాలో రోజుకూలీ అని ముంబై పోలీసులు చెప్పారు. అతడు వడ్రంగి పనిచేస్తాడన్నారు. అతడికి చెడు ఉద్దేశం లేదని, వెర్రితనంతో ఇలా చేశాడని ముదియా హఫీజ్‌లోని అతడి తల్లి అన్నారు. సరదాగా ఆ మెసేజులు పంపాడని అతడి సిస్టర్స్ చెప్పారు. పేద కుటుంబం నుంచి వచ్చిన తయ్యబ్‌ది రౌడీ క్యారెక్టరని, డాన్ కావాలన్నదే అతడి డ్రీమ్ అని నైబర్స్ చెప్తున్నారు.
Similar News
News November 18, 2024
APSRTCలో 2,064 ఖాళీలు: మంత్రి మండిపల్లి
APSRTCలో ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టడానికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి అసెంబ్లీలో వెల్లడించారు. సంస్థలో 1,275 డ్రైవర్లు, 789 మంది కండక్టర్ల కొరత ఉందని తెలిపారు. ఉద్యోగులకు EHS ద్వారా పూర్తిస్థాయి వైద్య సదుపాయాలు అందిస్తామన్నారు. రాష్ట్రంలోని బస్టాండులను ఆధునికీకరిస్తామని పేర్కొన్నారు. YCP హయాంలో నిధులు ఇవ్వకపోవడంతో బస్టాండుల నిర్వహణ కష్టతరమైందని ఆరోపించారు.
News November 18, 2024
పట్నం బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
TG: వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్‌పై దాడి కేసులో A1గా ఉన్న బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణను కొడంగల్ కోర్టు వాయిదా వేసింది. ఈ నెల 25న విచారిస్తామని తెలిపింది. అటు అతడిని తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై కాసేపట్లో విచారణ చేపట్టనుంది.
News November 18, 2024
రాష్ట్రంలో రోడ్లు సరిగా లేవంటూ హైకోర్టులో పిటిషన్
TG: రాష్ట్రంలో రోడ్లు సరిగా లేవని, గుంతల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై CJ ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రజలు రోడ్డు సమస్యలు తెలిపేలా మొబైల్ యాప్ రూపొందించి R&B, HMDA అధికారులు దాన్ని నిర్వహించాలని గతంలో ఆదేశించినట్లు హైకోర్టు అధికారులకు గుర్తు చేసింది. మరో నెలలో యాప్ అందుబాటులోకి తెస్తామని అధికారులు చెప్పారు. ఆపై విచారణను హైకోర్టు వచ్చే నెల 12కు వాయిదా వేసింది.