News October 30, 2024
రాజమౌళి కొత్త పోస్ట్.. హైప్ ఎక్కించు అంటున్న MB ఫ్యాన్స్

SSMB29 కోసం లోకేషన్ వేటలో ఆఫ్రికాలో ఉన్న దర్శకుడు రాజమౌళి మరో పోస్ట్ చేశారు. సింహాన్ని చూస్తున్నట్లుగా ఉన్న ఫొటోను ఇన్‌స్టాలో పంచుకున్నారు. ‘దీని పేరు బాబ్ జూనియర్. సెరెంగెటి(ఆఫ్రికాలోని ఓ ప్రాంతం)కి రాజు. ఈ ఫొటోను క్రిస్ ఫాలోస్ తీశారు’ అని రాసుకొచ్చారు. దీంతో మహేశ్ ఫ్యాన్స్ ఈ ఫొటోను షేర్ చేస్తూ హైప్ ఎక్కించు ఇంకా అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా క్రిస్ ప్రముఖ వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్.
Similar News
News January 14, 2026
సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ వాయిదా

ఇవాళ విడుదల కావాల్సిన సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ 2026 నోటిఫికేషన్‌ను <
News January 14, 2026
వచ్చే నెల 17 నుంచి టెన్త్ ప్రీఫైనల్ ఎగ్జామ్స్

AP: టెన్త్ విద్యార్థులకు ఫిబ్రవరి 17వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ప్రీఫైనల్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు పరీక్షలు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. వీటి అనంతరం గ్రాండ్ టెస్ట్, పబ్లిక్ పరీక్షలు ఉండనున్నాయి. మరోవైపు సంక్రాంతి సందర్భంగా ఈ నెల 10 నుంచి 18 వరకు స్కూళ్లకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే.
News January 14, 2026
CUSBలో 84 పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ సౌత్ బిహార్(CUSB)లో 84 టీచింగ్(62), నాన్ టీచింగ్(22) పోస్టుల కు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, సంబంధిత విభాగంలో పీజీ, PhD, M.Ed, NET/SLET/SET, LLM, M.Tech, MBBS, M.LSc ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: https://www.cusb.ac.in


