News October 30, 2024
న్యూట్రల్‌గా ఉండాలని నిర్ణయం.. బెజోస్‌కు షాక్!
అమెరికా ఎన్నికలు సమీపిస్తోన్న వేళ Washington Post కీలక నిర్ణయం తీసుకుంది. ఏపార్టీకి సపోర్ట్‌గా కాకుండా న్యూట్రల్‌గా ఉండేందుకు నిర్ణయించినట్లు సంస్థ అధినేత బెజోస్ ప్రకటించారు. ‘సంప్రదాయ US మీడియాపై ప్రజలు విశ్వాసం కోల్పోయారు. సోషల్ మీడియాలో వస్తోన్న ఫేక్ వార్తలనే ఎక్కువగా నమ్ముతున్నారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా’ అని తెలిపారు. బెజోస్ నిర్ణయంతో Washington Post భారీగా సబ్స్క్రైబర్లను కోల్పోతోంది.
Similar News
News November 18, 2024
లా అండ్ ఆర్డర్‌పై మండలిలో హాట్ హాట్ చర్చ
AP శాసనమండలిలో లా అండ్ ఆర్డర్‌పై చర్చ అధికార, విపక్షాల మధ్య వాగ్వాదానికి దారి తీసింది. రాష్ట్రంలో నేరాల కట్టడికి చర్యలు చేపడుతున్నామని హోంమంత్రి అనిత తెలిపారు. జగన్ తల్లికి, చెల్లికి అన్యాయం జరిగినా అండగా నిలుస్తామని ఆమె అన్నారు. దీంతో అనిత వ్యాఖ్యలపై వైసీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మంత్రి వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ ఎమ్మెల్సీలు సభ నుంచి వాకౌట్ చేశారు.
News November 18, 2024
బీజేపీలో చేరనున్న గహ్లోత్!
కేజ్రీవాల్ తీరుపై తీవ్ర విమర్శలు చేసి మంత్రి పదవికి <<14635271>>రాజీనామా<<>> చేసిన కైలాష్ గహ్లోత్ బీజేపీలో చేరనున్నట్టు తెలుస్తోంది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనాకు గహ్లోత్ సన్నిహితుడు. పంద్రాగస్టున జెండా ఎగురవేసేందుకు ఆతిశీకి బదులుగా గహ్లోత్‌కు సక్సేనా అవకాశం ఇచ్చారు. పైగా లిక్కర్ కేసులో ఆయన పాత్రపై ED కూపీ లాగుతుండడంతోనే బీజేపీలో చేరుతున్నారనే ఆరోపణలూ వినిపిస్తున్నాయి.
News November 18, 2024
మళ్లీ పెరిగిన బంగారం ధరలు
ఇటీవల తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ఇవాళ హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.660 పెరిగి రూ.76,310కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.600 పెరిగి రూ.69,950గా నమోదైంది. మరోవైపు సిల్వర్ రేట్లు స్థిరంగా కొనసాగుతున్నాయి. కేజీ వెండి ధర రూ.99వేలుగా ఉంది.