News October 30, 2024
నష్టాలు: పాత పెట్టుబడుల్ని వదిలించుకున్నారు

దీపావళికి ముందు ఇన్వెస్టర్లు పాత పెట్టుబడులను వదిలించుకున్నట్టు కనిపిస్తోంది. దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాలబాటపట్టాయి. సెన్సెక్స్ 426 పాయింట్లు నష్టపోయి 79,942 వద్ద, నిఫ్టీ 126 పాయింట్లు నష్టపోయి 24,340 వద్ద స్థిరపడ్డాయి. Finance, Pharma షేర్లు నష్టపోయాయి. క్యాపిటల్ గూడ్స్, ఆటో రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. Adani Ent, Hero Motoco టాప్ గెయినర్స్.
Similar News
News September 18, 2025
3 రోజుల పాటు బీచ్ ఫెస్టివల్

AP: ఈ నెల 26 నుంచి 28 వరకు 3 రోజుల పాటు బాపట్ల జిల్లాలోని సూర్యలంకలో బీచ్ ఫెస్టివల్ జరగనుంది. ఇందులో భాగంగా సాహస క్రీడలు, ఎగ్జిబిషన్, లేజర్ షో, సాంస్కృతిక కార్యక్రమాలు, ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. ఈ నెల 27న సీఎం చంద్రబాబు బీచ్‌ను సందర్శించి, రూ.97 కోట్ల అభివృద్ధి పనులుకు శంకుస్థాపన చేస్తారని ప్రభుత్వం తెలిపింది. బాపట్ల పట్టణం నుంచి సూర్యలంక బీచ్ 9 కి.మీ దూరం ఉంటుంది.
News September 18, 2025
శ్రీవారి దర్శనానికి కొనసాగుతున్న భక్తుల రద్దీ

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనం కోసం శిలా తోరణం వరకూ భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతోందని టీటీడీ తెలిపింది. నిన్న స్వామివారిని 68,213 మంది భక్తులు దర్శించుకున్నారు. 29,410 మంది శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.2.86 కోట్ల ఆదాయం వచ్చినట్లు TTD వెల్లడించింది.
News September 18, 2025
ట్రైనీ ఇంజినీర్ పోస్టులు

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<