News October 30, 2024

రూ.11.16 కోట్లతో R&B రోడ్లకు మరమ్మతులు: కలెక్టర్

image

కర్నూలు జిల్లాలో 412 కి.మీ R&B రోడ్లపై గుంతలు పూడ్చేందుకు ప్రభుత్వం రూ.11.16 కోట్లు మంజూరు చేసిందని కలెక్టర్ రంజిత్ బాషా తెలిపారు. ఈ పనులు రెండు, మూడు రోజుల్లో మొదలు కావాలని R&B అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో రోడ్ల నిర్మాణంపై సంబంధిత శాఖ ఇంజినీర్లతో కలెక్టర్ సమీక్షించారు.

Similar News

News October 30, 2024

టీటీడీ బోర్డు సభ్యుడిగా మల్లెల రాజశేఖర్ గౌడ్

image

టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ గౌడ్‌కు సీఎం చంద్రబాబు కీలక బాధ్యతలు అప్పగించారు. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పాలక మండలిలో ఆయనకు సభ్యుడిగా చోటు కల్పించారు. TTD నూతన ఛైర్మన్‌గా బీఆర్ నాయుడును నియమించగా, మరో 23 మందికి ఇందులో సభ్యులుగా అవకాశం కల్పించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

News October 30, 2024

కర్నూలు: రేపు క్రాకర్స్ కాలుస్తున్నారా?.. అయితే ఇది మీకోసమే!

image

రేపు దీపావళి సందర్భంగా బాణసంచా కాల్చేటప్పుడు పలు జాగ్రత్తలు-సూచనలను తప్పనిసరిగా పాటించాలని ఏపీ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) పిలుపునిచ్చింది. అగ్ని ప్రమాదం సంభవిస్తే వెంటనే అత్యవసర సహాయం కోసం 101, 112, 100, 1070 టోల్ ఫ్రీ నంబర్లను సంప్రదించాలి అని సూచించింది. జాగ్రత్తలు-సూచనలకు సంబంధించి ఈ మేరకు APSDMA ఓ ఫోటోను Xలో ట్వీట్ చేసింది.

News October 30, 2024

పదవీ విరమణ పొందిన ఏఆర్ ఎస్ఐని సత్కరించిన ఎస్పీ

image

సుదీర్ఘకాలం పోలీసు శాఖలో పనిచేసి పోలీసు సిబ్బంది పదవీ విరమణ పొందడం అభినందనీయమని కర్నూలు ఎస్పీ బిందుమాధవ్ పేర్కొన్నారు. ఏఆర్ ఎస్ఐ జీవీ సుబ్బారెడ్డి పదవీ విరమణ సందర్భంగా ఆయనను శాలువ, పూలమాలతో సత్కరించి, జ్ఞాపిక అందజేశారు. కుటుంబంతో సంతోషంగా గడపాలని, పదవీ విరమణ పొందిన తర్వాత ఏమైనా సమస్యలుంటే నేరుగా ఎస్పీ కార్యాలయాన్ని సంప్రదించాలని అన్నారు.