News October 30, 2024
చంద్రబాబు, కరవు కవలపిల్లలు: VSR

AP: సీఎం చంద్రబాబు, కరవు కవల పిల్లలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. వారి మధ్య విడదీయలేని సంబంధం ఉందని ఆయన ట్వీట్ చేశారు. ‘ప్రస్తుతం రాష్ట్రంలోని 54 మండలాల్లో కరవు పరిస్థితులు ఏర్పడ్డాయి. రాయలసీమలో కరవు నీడలు వెంటాడుతున్నాయి. గత ప్రభుత్వం రైతుల కోసం పంటల బీమా పథకం అమలు చేస్తే కూటమి ప్రభుత్వం దానిని నిర్వీర్యం చేసింది. కూటమి సర్కార్ రైతుల ఉసురు తీస్తోంది’ అని ఆయన ఫైర్ అయ్యారు.
Similar News
News November 9, 2025
హిందువులు మీతో లేరని ఒప్పుకుంటారా?: రేవంత్

TG: జూబ్లీహిల్స్ ప్రజల్లో 80% హిందువులు BJP వైపు ఉన్నారన్న బండి సంజయ్ వ్యాఖ్యలపై CM రేవంత్ సెటైర్లు వేశారు. ‘ఈ ఎన్నికల్లో BJP డిపాజిట్ పోతుంది. రాసిపెట్టుకోండి. మీరు ఓడిపోతే హిందువులు మీతో లేరు అని భావించాలి’ అని ఛాలెంజ్ విసిరారు. BRS గెలుపు కోసం జూబ్లీహిల్స్‌లో BJP పనిచేస్తోందన్నారు. BRS విలీనమైతే వచ్చే లాభంపై ఇక్కడ రెండు పార్టీలు లిట్మస్ టెస్ట్ చేసుకుంటున్నాయని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
News November 9, 2025
రిజల్ట్ తెలిసే KCR ప్రచారం చేయలేదు: రేవంత్

జూబ్లీహిల్స్‌లో కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నారని KTR చేసిన విమర్శలపై రేవంత్ స్పందించారు. పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన బాధ్యత తనపై ఉంది కాబట్టే జూబ్లీహిల్స్‌లో ప్రచారం చేస్తున్నట్లు చెప్పారు. ఇతర చోట్ల ఉపఎన్నికలు వచ్చినప్పుడు ఇంతకంటే ఎక్కువ ప్రచారం చేశానన్నారు. జూబ్లీహిల్స్‌లో గెలుపుపై KCRకు నమ్మకం లేదన్నారు. అందుకే సునీతను గెలిపించాలని కనీసం ప్రకటనైనా విడుదల చేయలేదని కౌంటర్ వేశారు.
News November 9, 2025
మంచి మనసు చాటుకున్న శ్రీచరణి

వరల్డ్ కప్ విజయంలో కీలకపాత్ర పోషించిన తెలుగమ్మాయి శ్రీచరణి తీసుకున్న నిర్ణయంపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఆమె ట్రైనింగ్ పొందిన కడప క్రికెట్ అకాడమీలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. శ్రీచరణిని అభినందిస్తూ కడప టీడీపీ అధ్యక్షుడు, కమలాపురం MLA రూ.10 లక్షలు ఇవ్వనున్నట్టు ప్రకటించారు. వాటిని అకాడమీలో ట్రైనింగ్ పొందుతున్న అండర్-14 క్రికెట్ టీమ్ ప్రోత్సాహానికి కేటాయించాలని శ్రీచరణి కోరారు.


