News October 30, 2024

హైదరాబాద్‌లో దీపావళి ఎఫెక్ట్

image

దీపావళి పండుగ వేళ హైదరాబాద్‌లో మిఠాయి దుకాణాలకు ఫుల్ డిమాండ్ పెరిగింది. బేగంబజార్, చార్మినార్, అత్తాపూర్, మెహిదీపట్నం, గుల్ మొహర్ బజార్, రాణిగంజ్, సికింద్రాబాద్, తార్నాక లాంటి ప్రాంతాల్లో స్వీట్ షాప్స్ వద్ద రద్దీ ఏర్పడింది. హైదరాబాద్ నగరం సహా ఇతర ప్రాంతాల నుంచి హోల్ సెల్ డీలర్లు బేగం బజార్‌లో మిఠాయిలు కొనుగోలు చేసేందుకు లైన్లలో బారులు తీరారు.

Similar News

News October 30, 2024

HYD: విషాదం.. ఈతకు వెళ్లి ఇద్దరి మృతి

image

యాదాద్రి జిల్లా మూటకొండూరు మండలం అమ్మనబోలు గ్రామంలోని అబిద్‌నగర్‌లో ఇద్దరు నగరవాసులు మృతి చెందారు. సరదాగా 12 మంది ఇంటర్ చదువుతున్న విద్యార్థులు HYD నుంచి స్నేహితుడి ఊరైన మూటకొండూరు మండలం అబిద్‌నగర్‌కు వెళ్లారు. ఆ ఊరిలోని చెరువులో ఈత కొడుతుండగా ప్రమాదవశాత్తు శశి, చరణ్ అనే విద్యార్థులు నీట మునిగి మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతులు బోడుప్పల్ వాసులుగా గుర్తించి కేసు నమోదు చేశారు.

News October 30, 2024

HYD: ప్రాణాంతకంగా మారుతున్న గాలి కాలుష్యం!

image

హైదరాబాద్‌లో గాలి కాలుష్యం రోజురోజుకు పెరుగుతూ వస్తోంది. దాదాపు 5.6% మరణాలు కాలుష్యం వల్లే జరుగుతున్నట్లు ల్యాన్ సెట్ నివేదికలో వెల్లడైంది. 2008 నుంచి 2019 మధ్య 11 ఏళ్ల కాలంలో సంభవించిన 36 లక్షల మరణాలను ల్యాన్ సెట్ నివేదిక అధ్యయనంలో విశ్లేషించింది. ఏడాదిలో వాయు కాలుష్యం వల్ల 1597 మరణాలు సంభవించాయని పేర్కొంది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సరిగా పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.

News October 30, 2024

హైదరాబాద్ ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపుల భయం!

image

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపుల భయం పట్టుకుంది. గత కొన్ని రోజులుగా పదే పదే బాంబు బెదిరింపు కాల్స్, మెయిల్స్ రావడంతో ఎప్పటికప్పుడు అధికారులు అప్రమత్తమౌతూ వస్తున్నారు. HYD నుంచి సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ పాఠశాలకు సైతం ఇటీవల బాంబు బెదిరింపు వచ్చింది. HYD పాఠశాల, కేంద్రీయ విద్యాలయాలను పేల్చేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి బెదిరింపులకు పాల్పడ్డ సంగతి తెలిసిందే.